Begin typing your search above and press return to search.
#RussiaUkrainewar : రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి కారణం ఇదేనా?
By: Tupaki Desk | 24 Feb 2022 8:38 AM GMTరష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు అనధికారికంగా బాంబుల వర్షం కురిపించినా.. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక యద్దం చేయడమేనని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ పై దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పరితపిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశం పోరాడుతోంది. అయితే ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ మద్దతు పై రష్యా ఇంకా మండిపడుతోంది.
ఇక యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదనే విషయాన్ని పుతిన్ చెప్పడం ఆందోళన వాతావరణం ఏర్పడింది. అయితే రష్యా సరిహద్దులోనే ఉన్న ఉక్రెయిన్ పై పుతిన్ ఎందుకు యుద్ధం చేస్తున్నట్లు..? ఈ ఆందోళన వాతావరణానికి బీజం ఎక్కడ పడింది..? అనే సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి.
ఒకప్పుడు రష్యాలో భూభాగమైన ఉక్రెయిన్ 1991లో ప్రత్యేక దేశంగా ఏర్పడింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్ నాయకుడు లియోనిడ్ క్రావ్ చుక్ మాస్కో నుంచి స్వాతంత్ర్యం పొందినట్లు ప్రకటించాడు. స్వతంత్ర ఉక్రెయిన్లో ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యక్ష ఎన్నికల్లో క్రావ్ చుక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొన్ని పరిణామాల జరిగిన నేపథ్యంలో మూడేళ్ల తరువాత.. అంటే 1994లో క్రావ్ చుక్ ను లియోనిడ్ కుచ్మా ఓడించాడు. ఆ తరువాత జరిగిన 1999లో జరిగిన ఎన్నికల్లోనూ లియోనిడ్ కుచ్మా విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు లియోనిడ్ కుచ్మా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
ఇక ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో రష్యా అనుకూల అభ్యర్థి విక్టర్ యసుకోవిచ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆందోళనలు జరిగిన నేపథ్యంలో మరోసారి ఎన్నికలు నిర్వహించారు. ఈసారి పాశ్చాత్య దేశాల అనుకూ మాజీ ప్రధాన మంత్రి విక్టర్ యుప్చెంకో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005లో ఉక్రెయిన్ ను క్రెమ్లిన్ ప్రభావం నుంచి బయటికి తెచ్చి నాటో, ఈయూ వైపు నడిపిస్తానని విక్టర్ యుప్చెంకో వాగ్దానం చేశాడు. ఇందులో భాగంగా టిమోషెంకోను ప్రధాన మంత్రిని చేశారు. అయితే పాశ్చాత్య దేశాల మధ్య జరిగిన అంతర్గత పోరుతో ఆమెను ప్రధాన మంత్రి పదవి నుంచి తొలగించారు.
ఇదిలా ఉండగా 2010లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యుసుకోవిచ్ తిమోషెంకో ఓడిపోయాడు. ఆ తరువాత రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఉన్న నల్లసముద్రపు ఓడరేవు లీజు ఒప్పందాన్ని గ్యాస్ ధరల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2013 నవంబర్లో యనుకోవిచ్ ప్రభుత్వం ఈయూ(యూరోపియన్ యూనియన్)తో వాణిజ్యం, అసోసియేషన్ చర్చలను నిలిపివేసింది. ఇదే ఏడాది ఏప్రిల్ లో డాన్ బాస్ తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తూనే 2022 వరకు పోరాటలు చేస్తున్నారు.
ఇక్కడ మరో విషయమేంటంటే.. 2013 మేలో వ్యాపార వేత్త పెట్రో పోరోషెంకో పాశ్చాత్య అనుకూల ఎజెండాతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. జూలైలో, ఆమ్ స్టర్ డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ల ప్రయాణికుల విమానం ఎంహెచ్ 17ను కూల్చివేసింది. ఈ ప్రమాదంలో 298 మంది మరణించారు. అయితే ఇది రష్యా పనేనని దర్యాప్తులో తేలినా.. దానిని పుతిన్ ఖండించారు. ఇక 2017లో ఉక్రెయిన్ ఈయూతో వ్యాపార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఉక్రెయిన్ వాసులు వీసా లేకుండా ఈయూ దేశాలకు వెళ్లే అవకాశం దొరికింది. ఇక 2019లో ఉక్రెయిన్ కొత్త అర్దడాక్స్ చర్చికి గుర్తింపు లభించడంతో రష్యాకు