Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి

By:  Tupaki Desk   |   1 March 2022 11:13 AM GMT
ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతి
X
ఉక్రెయిన్ లో రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం ఖార్కీవ్ లో జరిపిన దాడుల్లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్ బాగ్చీ ట్విట్టర్ లో వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విద్యార్థిది కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి ‘నవీన్’గా గుర్తించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

విద్యార్థి ఉక్రెయిన్ లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నాడు. ఖార్కివ్ లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా బాంబు దాడులకు పాల్పడింది. అయితే అవి గురితప్పి నవీన్ ఉంటున్న ప్రాంతంపై పడినట్లు తెలుస్తోంది.

తాజా ఘనట నేపథ్యంలో భారత్ లోని ఉక్రెయిన్, రష్యా రాయబారులతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఖార్కివ్ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని రెండు దేశాలను కోరినట్లు ఎంఈఏ వెల్లడించింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఆ నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఆ నగరాన్ని వెంటనే వీడాలని ఈ ఉదయమే అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

సాధ్యమైనంత త్వరగా రైళ్లు, ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో కీవ్ ను వీడి సరిహద్దులకు రావాలని భారత విద్యార్థులు, పౌరులకు సూచించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఖార్కివ్ లో భారత విద్యార్తి మృతిచెందడం విషాదం నింపింది.