Begin typing your search above and press return to search.

తన ఫ్యామిలీని రహస్య ప్రాంతానికి తరలించిన పుతిన్

By:  Tupaki Desk   |   2 March 2022 10:30 AM GMT
తన ఫ్యామిలీని రహస్య ప్రాంతానికి తరలించిన పుతిన్
X
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య భయానక పరిస్థితులు రోజురోజుకీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఓవైపు ప్రపంచదేశాలు రష్యా తీరును వ్యతిరేకిస్తున్నా.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తీరు మాత్రం మారడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ఉక్రెయిన్ పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు బాంబుల దాడులు కొనసాగిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం యుద్ధం ఇప్పటితో ఆగదని తేలిపోయింది. ఎందుకంటే పుతిన్ సర్వసన్నధ్ధంగా ఉన్నారు. పుతిన్ తన కుటుంబ సభ్యులందరినీ అత్యంత సురక్షితమైన బంకర్ లోకి తరలించినట్టుగా తెలుస్తోంది.

అణ్వాయుధాలతో దాడులు చేసినా అత్యంత సురక్షితంగా ఉండే ఆ ప్రాంతానికి తన కుటుంబ సభ్యులందరినీ పుతిన్ పంపించారని బ్రిటన్ వార్త సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది.

అణుయుద్ధం జరిగినా సురక్షితంగా ఉండేలా సైబీరియా ప్రాంతంలో అత్యాధునిక వసతులతో కూడిన బంకర్ ను ఏర్పాటు చేశారని సదురు వార్తా సంస్థ తెలిపింది.

అట్లయ్ పర్వత ప్రాంతంలో ఈ బంకర్ ను ఏర్పాటు చేశారని బ్రిటన్ మీడియా వివరించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా పుతిన్ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని సదురు వార్తా సంస్థ తెలిపింది.

ఉక్రెయిన్ కు ప్రపంచదేశాల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ కు తమ దేశంపై అణుదాడి జరుగుతుందన్న అనుమానం కూడా ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రష్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటో కాలమే సమాధానం చెప్పాలి.