Begin typing your search above and press return to search.

పుతిన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా ?

By:  Tupaki Desk   |   2 March 2022 11:30 AM GMT
పుతిన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా ?
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన ఆరో రోజుకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా ? తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పుతిన్ ఉక్కిరిబిక్కిరి అయిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే మొదటిది ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు రంగంలోకి దిగటం. ఇక రెండో కారణం ఏమిటంటే కఠినమైన ఆర్థిక ఆంక్షలు అమలులోకి రావటం.

రష్యా సైన్యం ముందు మామూలుగా అయితే ఉక్రెయిన్ ఏ విధంగా పనికిరాదు. అయితే ఆరు రోజులైనా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయంటే అందుకు నాటో దేశాల్లో సభ్యులైన జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తుండటమే. ఉక్రెయిన్ దగ్గర లేని స్టింగర్ లాంటి అత్యాధునిక క్షిపణులను బ్రిటన్ పెద్ద ఎత్తున ఉక్రెయిన్ కు అందించింది. అలాగే ఆధునిక ఆయుధాల వాడకంపై అమెరికా మార్గదర్శకత్వంలో ఉక్రెయిన్ సైన్యం రష్యా సైన్యంపై భీకరంగా ఎదురుదాడులు చేస్తోంది.

ఇక ఆర్థిక అంశాల విషయాలను చూస్తే రష్యా కరెన్సీ రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది. అలాగే రష్యా దగ్గరున్న 650 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఫ్రీజ్ చేసేయటం. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమలు చేయటంలో భాగంగా స్విఫ్ట్ అనే పద్దతిని అమలు చేస్తోంది.

గతంలో యుద్ధం నేపధ్యంలో ఏ దేశంపైన కూడా అమలు చేయనంత కఠినంగా స్విఫ్ట్ ను ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి. పై రెండు కారణాల వల్ల పుతిన్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో 48 గంటల్లో ఉక్రెయిన్ ను స్వాదీనం చేసుకోవచ్చని అనుకుని యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనాలు పూర్తిగా తప్పినట్లు అర్ధమవుతోంది.

ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా ఆ దేశంలోని జనాలు కూడా రష్యా సైన్యంపై తిరగబడతారని, దాడులు చేస్తారని బహుశా పుతిన్ ఊహించుండరు. అందుకనే దాదాపు 5700 మంది సైనికులతో పాటు ట్యాంకులు, యుద్ధ వాహనాలను రష్యా కోల్పోయింది. ఎక్కువ రోజులు యుద్ధం కంటిన్యూ అయితే రష్యా మరింతగా నష్టపోవటం ఖాయం.