Begin typing your search above and press return to search.

యుద్ధమంటే రష్యన్ సైనికులు వణికిపోతున్నారా? అలా చెప్పిందెవరు?

By:  Tupaki Desk   |   3 March 2022 8:30 AM GMT
యుద్ధమంటే రష్యన్ సైనికులు వణికిపోతున్నారా? అలా చెప్పిందెవరు?
X
కదిలించుకొని మరీ యుద్ధం చేస్తున్న రష్యాపై ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా సైతం.. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. రష్యాతో నేరుగా తలపడే యోచన లేదన్న మాటను చెప్పడం చూస్తే.. అగ్రరాజ్యపు బుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు సాయం చేస్తానని చెబుతూనే.. మిత్ర ధర్మాన్ని పాటిస్తానంటూనే.. అమెరికాతో మాత్రం నేరుగా యుద్ధం చేయనని చెప్పటం అమెరికాకు మాత్రమే చెల్లుతుందేమో?

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ లోకి అడుగు పెట్టిన రష్యన్ సైనికులు.. యుద్ధం చేయటానికి వణుకుతున్నారా? అక్కడెక్కడో కమాండ్ సెంటర్ లో ఉంటూ.. ఉక్రెయిన్ వీధుల్లో ఉంటుందన్న తమకు ఇస్తున్న ఆదేశాల్ని అమలు చేయాలని చెబుతున్న తీరుపై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు..కమాండ్లను ఏమాత్రం ఫాలో కాకపోవటం గమనార్హం. అయితే.. ఈ విషయాల్ని ప్రపంచానికి చెబుతున్నది అమెరికా నిఘా విభాగమైతే.. ఆ మాటల్లో నిజం ఉందన్న విషయాన్ని బ్రిటన్ నిఘా సంస్థ స్పష్టం చేస్తోంది.

అంతేకాదు.. తాము ఉత్తుత్తి మాటలు చెప్పటం లేదంటూ.. కొందరు సైనికుల వాయిస్ రికార్డుల్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటం.. అవి కాస్తా వైరల్ అవుతుండటం.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉక్రెయిన్ పట్టణాల్లోని పలు భాగాల్ని ధ్వంసం చేయాలని వచ్చిన కమాండ్ ను ఫాలో కావటానికి రష్యన్ సైనికులు సిద్ధంగా లేరన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా షాడో బ్రేక్ అనే నిఘా సంస్థ ట్విట్టర్ వేదికగా 24 గంటల నిడివి ఉన్న వాయిస్ రికార్డులను పోస్టు చేయటం.. రష్యన్ దళాలకు.. యూనిట్ల మధ్య సరైన కోఆర్డినేషన్ లేదన్న వాదనను వినిపిస్తున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ లో యుద్ధ బాధ్యతల్ని నిర్వహిస్తున్న వారు.. కమాండ్ సెంటర్ నుంచి వచ్చిన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేయటానికి ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు.

తమ సీనియర్లు జారీ చేసిన ఆదేశాల్ని అమలు చేయకుండా ఉంటున్న కొందరు రష్యన్ సైనికుల తీరు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఉక్రెయిన్ లో కనిపించిన ఆస్తిని ధ్వంసం చేసి.. ప్రజల్ని కాల్చేయాలన్న ఆదేశాలు వచ్చిన వైనాన్ని అమలు చేయటానికి రష్యన్ సైనికులు అస్సలు ఇష్టపడటం లేదు. అదేమంటే.. సాధారణ ప్రజలు కనిపిస్తున్నారని.. వారు వీధుల్లో తిరుగుతున్న వేళ.. వారిపై ఆంక్షల్ని విదించటానికి రష్యన్ సైనికులు ఇష్టపడటం లేదు.

అయితే.. ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారత్ కు సాయం చేస్తామని చెప్పే రష్యా.. ముందు తానున్న యుద్ధ రంగంలో తమ పై అధికారుల్ని ఆదేశాలని సూటిగా.. చెప్పింది చెప్పినట్లుగా చేసేలా తన సైన్యాన్ని సిద్ధం చేసుకోవటమే రష్యాకు ఇప్పుడున్న పెద్ద సవాలుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.