Begin typing your search above and press return to search.

పుతిన్ భారీ స్కెచ్ లీక్..: జెలెన్ స్కీ స్థానంలో యనుకోవిచ్..?

By:  Tupaki Desk   |   3 March 2022 9:30 AM GMT
పుతిన్  భారీ స్కెచ్ లీక్..: జెలెన్ స్కీ స్థానంలో యనుకోవిచ్..?
X
రష్యా అధ్యక్షుడు వేసిన భారీ స్కెచ్ లీకైంది.!! తాను అనుకున్నట్లుగా ఉక్రెయిన్ లొంగిపోతే ఏం చేయాలో వేసుకున్న ప్లాన్ దిశగా పుతిన్ వెళుతున్నాడు. అన్నీ అనుకున్నట్లయితే ఉక్రెయిన్ కు ఎవరిని అధ్యక్షుడు చేయనున్నారోనన్న విషయం బయటపడింది. ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల మోత మోగిస్తున్న పుతిన్ ఆ తరువాత ఆ దేశ అధ్యక్షుడిని అవసరమైతే మట్టుబెట్టడానికి కూడా రెడీగా ఉన్నట్లు ఇప్పటికే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడున్న బెలెన్ స్కీ లొంగిపోయినా.. లేక రష్యా చర్యల వల్ల పక్కకు తప్పుకున్నా ఆ తరువాత ఎవరిని నియమించాలో పుతిన్ ఓ స్కెస్ వేశాడు. బెలెన్ స్కీ స్థానంలో విక్టర్ యనుకోవిచ్ ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

2010లో ఉక్రెయిన్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన యనుకోవిచ్ కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో అతడు రష్యా పారిపోయి ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్నాడు. 1997 నుంచి 2002 వరకు యనుకోవిచ్ గవర్నర్ గా విధులు నిర్వహించాడు. ఆ తరువాత 2006 నుంచి 2007 వరకు దేశ ప్రధానిగా ఉన్నాడు. 2010లో ఉక్రెయిన్ కు నాల్గో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన అధికారంలో ఉండగా రష్యాతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. అంతేకాకుండా రష్యాతో వాణిజ్య ఒప్పందంపై కూడా సంతకం చేశారు.అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో పుతిన్ యనుకోవిచ్ అండగా ఉండేందుకు ప్రయత్నించాడు. అయితే ఫలితాలు తారుమారు కావడంతో యనుకోవచిచ్ కీవ్ నుంచి ఖార్కివ్ కు పారిపోయాడు. అలా 2013 లో నెలన్నర పాటు యూరోమెయిడాన్ నిరసనలతో ఉక్రెయిన్ అట్టుడికిపోయింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో యనుకోవిచ్ అధ్యక్ష పదవి కోల్పోయాడు. అయితే యనుకోవిచ్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఓటింగ్ నిర్వహించింది. దీంతో అతడు తొలగిపోయాడు. కానీ ఇది అన్యాయమంటూ యనుకోవిచ్ తరుపున రష్యా పాట పాడింది.

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జన్మించిన యనుకోవిచ్ వీధుల వెంట తిరుగుతూ యాచిస్తుండేవాడట. ఆ తరువాత ఆకలితో అలమటిస్తూ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తన బాల్యం ఎంతో ఘోరంగా గడిచిందని ఆయన పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అనూహ్యంగా తన జీవితంలో జరిగిన మార్పులతో వ్యాపారవేత్తగా ఎదిగానని, ఆ తరువాత రాజకీయాల్లో రాణించి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడినయ్యానని చెప్పారు. అంతేకాకుండా ఆయన చిన్నతనంలో జైలు జీవితం గడిపానని.. యువత నేర ప్రవృత్తి చట్టాల మార్పునకు తీసుకొచ్చారు.

2004లో మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేశాడు యనుకోవిచ్. అయితే ఉక్రెయిన్ సుప్రీం కోర్టు ఈ ఫలితాలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పునివ్వడంతో ఆరెంజ్ విప్లవం మొదలైంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో యుష్పెంకో చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తరువాత 2010లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో 2013లో ఈయూ ఉక్రెయిన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి యనుకోవిచ్ నిరాకరించాడు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. కైవ్ లోని మైదాన్ వద్ద జరిగిన ప్రధాన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఆ తరువాత అతను రష్యా పారిపోవడంతో నిరసన కారులు శాంతించారు.

తాజాగ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఉన్న జెలెన్ స్కీ తప్పుకుండే యనుకోవిచ్ ను అధ్యక్షుడిగా చేసేందుకు పుతిన్ పక్కా ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. కానీ ఎనిమిది రోజులుగా ఉక్రెయిన్ రష్యాతో విరోచితంగా పోరాడుతోంది. అయితే ముందు ముందు రష్యా ధాటికి ఉక్రెయిన్ తట్టుకుంటుందా..? లేదా..? చూడాలి.