Begin typing your search above and press return to search.

ఇప్పటికీ తటస్థమే..: వైఖరి స్పష్టం చేసిన భారత్

By:  Tupaki Desk   |   3 March 2022 7:30 AM GMT
ఇప్పటికీ తటస్థమే..: వైఖరి స్పష్టం చేసిన భారత్
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని కీవ్ నగరాన్ని అతలాకుతలం చేసిన రష్యా.. ఇప్పుడు ఖార్కీవ్ నగరంపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన ఓటింగ్ లో రష్యాకు అనుకూలంగా 141 దేశాలు మద్దతు పలికాయి. వ్యతిరేకంగా 5 దేశాలు ఓటేశాయి.

కాగా భారత్ సహా 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో ఇరుదేశాల్లో జోక్యం చేసుకోకుండా భాతర్ తటస్థ వైఖరికే మొగ్గు చూపింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మొదటి నుంచీ భారత్ తటస్ఠ వైఖరితోనే ఉంది. తాజాగా నిర్వహించిన ఓటింగ్లోనూ అదే చేసింది. ఈ సందర్భంగా యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.

ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాన మంత్రి మోదీ ఇప్పటికీ రెండు సార్లు ఫోన్ చేశారు. గతంలో ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని కోరారు. ఇక తాజాగా మరోసారి ఫోన్ చేసి భారతీయులను సురక్షితంగా చేరే వరకు యుద్ధానికి విరామం పలకాలని కోరారు. దీంతో పుతిన్ ఆరు గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు భారత్ నుంచి యుద్ధ విమానాల్లో కేంద్ర మంత్రులు బయలు దేరారు.

ఓ వైపు ఐక్యరాజ్య సమితిలో చర్చలు సాగుతుండగానే రష్యా అటు ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లోని ప్రధాన రెండో నగరం ఖార్కీవ్ పై దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో సాధారణ పౌరులు సైతం బలవుతున్నారు. అయితే అదే స్థాయిలో రష్యా బలగాలపై ఉక్రెయిన్ వాసులు తిరగబడుతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 498 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.

మరో 1,597 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే ఈ యుద్ధంలో రష్యా సైనికులు భారీగా మరణించినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఇప్పటి వరకు 2,870 మందికి పై ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 3,700 మందికి పైగా గాయపడ్డారని కోనాషెంకోవ్ తెలిపారు. అలాగే 572 మంది ఇతరులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం ఆరు విమానాలను దేశానికి పంపినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 12 మందల మంది విద్యార్థులను రప్పించనున్నారు. ఆపరేషన్ గంగ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో కేంద్ర మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ల యుద్ధ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.