Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయమిస్తే నెలకు 450 డాలర్లు

By:  Tupaki Desk   |   14 March 2022 6:55 AM GMT
ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయమిస్తే నెలకు 450 డాలర్లు
X
యుద్ధంతో వలస బాటపట్టిన ఉక్రెయిన్ ప్రజలకు కనీసం ఆరు నెలల పాటు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకుంటే ‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్’ పథకం కింద నెలకు 350 సౌండ్లు అంటే రూ. 450 డాలర్లు (రూ.35వేలు) చెల్లిస్తామని బ్రిటన్ దేశం సంచలన ప్రకటన చేసింది. రష్యా దాడులతో ఇప్పటికే లక్షలాది మంది ఉక్రెనియన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. తమ పిల్లలతో సరిహద్దు దేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇలా ఉక్రెయిన్ నుంచి బ్రిటన్ వచ్చే ప్రజలను ఆదుకునేందుకు బోరిస్జాన్సన్ ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.

ఈ పథకం ప్రకారం.. బ్రిటన్ వచ్చే ఉక్రెయిన్ వ్యక్తి లేదా కుటుంబానికి బ్రిటన్ జాతీయులు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది. వారిని తమ ఇంట్లో లేదా తమకు చెందిన ఇతర భవనంలో ఉచితంగా ఉండనివ్వాలి. కనీసం ఆరు నెలల పాటు వారికి ఆశ్రయం కల్పించాలి. ఇందుకోసం ప్రభుత్వం సోమవారం ప్రారంభించే వెబ్ సైట్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. బ్రిటన్ జాతీయులు ఎవరైనా ఉక్రెయిన్ శరణార్థుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతాపరమైన అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆ దరఖాస్తును ఆమోదిస్తారు. ఉక్రెయిన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించినందుకు ఆ తర్వాత నుంచి నెలకు రూ.35 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఇంట్లో ఒక గదిలో అయినా సరే ఉక్రెయిన్లకు కనీసం 6 నెలల పాటు షెల్టర్ ఇవ్వడానికి ఒప్పుకుంటే హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ పథకం కింద నెలకు 350 పౌండ్లు అంటే రూ.35వేలు చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాలకు ఒక్కో శరణార్థికి రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని బ్రిటన్ తెలిపింది. కుటుంబ సంబంధాలు ఉన్న వారు మాత్రమే ఉక్రెయిన్ ఫ్యామిలీ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఈ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్ కు బ్రిటన్ మద్దతుగా ఉంటుందని.. బ్రిటీష్ ఉక్రెయిన్ లకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నారని యూకే మంత్రి మైఖేల్ గోవ్ తెలిపారు. ఈ మేరకు ఉక్రేనియన్ స్నేహితులకు మద్దతు అందించాలని ప్రజలను కోరుతున్నానని అన్నారు.

యుద్ధం కారణంగా బ్రిటన్ కు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రజలకు ఇచ్చిన వీసాల సంఖ్య 3వేలకు చేరిందని మంత్రి మైఖేల్ గోవ్ తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ లో బంధువులు ఉన్న ఉక్రెనియన్లు మాత్రమే వస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పథకం ద్వారా వేలాది మంది యుక్రెనియన్లకు బ్రిటన్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి ఉక్రెయిన్ ప్రజలను వీలైనంత త్వరగా బ్రిటన్ కు తీసుకొచ్చేందుకు ఈ పథకం సహాయం పడుతుంది మంత్రి మైఖేల్ తెలిపారు.

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి 25 లక్షల మందికి పైగా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి అంచనావేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థి సమస్య ఇదని పేర్కొంది.