Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు నో ఎంట్రీ..: పుతిన్ రివర్స్ ఝులక్..
By: Tupaki Desk | 16 March 2022 5:45 AM GMTరష్యా, ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధం 20 రోజులకు చేరుకుంది. ఇరు దేశాల్లో తీవ్ర నష్టం జరుగుతున్నప్పటికీ యుద్ధం ముగింపు దశకు చేరుకునే అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ రెండు దేశాలు తగ్గేదేలే అంటూ సవాల్ విసురుతున్నాయి. ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై మిస్సైల్స్ దాడి చేస్తూ ప్రధాన భవనాల్ని కూల్చేస్తుంది రష్యా.
అటు ఉక్రెయిన్లోకి చొచ్చుకొచ్చిన రష్యా సైనికులను ఉక్రెయిన్ మట్టుబెడుతోంది. ఇదిలా ఉండగా రష్యా తాజాగా యూరప్ దేశాలపై ఆంక్షలు విధించింది. అమెరికా, బ్రిటన్ తో సహా ఇతర యూరప్ దేశాల అధ్యక్షులు తమ దేశంలోని అడుగుపెట్టడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ జారీ చేసిన ఈ ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఈయూ దేశాలు ఇప్పటికే పలు ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా రష్యాతో పలు కంపెనీలు ఆర్థిక కార్యకాలపాలు కట్ చేసుకున్నాయి. అటు రష్యా విమానాలను సైతం ఇతర దేశాలకు రానివ్వట్లేదు. తాజాగా చమురు కొనుగోలుపై కూడా నిషేధం విధించారు. దీంతో పరోక్షంగా ఈయూ వర్సెస్ రష్యా అన్నట్లుగా మారింది. అయితే ఉక్రెయిన్ విషయంలో నేరుగా యుద్ధం లోకి దిగకపోయినా రష్యాకు మాత్రం యూరోపియన్ దేశాలు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఆ దేశంతో ఎలాంటి కార్యకాలపాలు నిర్వహించొద్దని ఇటీవల భద్రతా మండలి సమావేశంలో కూడా నిర్ణయించారు.
ఇదిలా ఉండగా రష్యాపై విధిస్తున్న ఆంక్షలకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భయపడడం లేదు. తమ దేశంపై ఆంక్షకలకు ప్రతీకారంగా పుతిన్ తాజాగా సంచలన ప్రకనటన చేశారు. తమ దేశంలోకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు మాజీ అధ్యక్షులు, బ్రిటన్, జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు అడుగుపెట్టొద్దని హెచ్చరించారు. అటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా నిషేధం విధించారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే రష్యాపై ఆంక్షలు విధించి తమ దారికి తెచ్చుకోవాలనుకున్న పశ్చిమ దేశాలకు పుతిన్ ఝులక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. ఉక్రెయిన్లోని నగరాలన్నీ ఆక్రిమంచుకుంటున్నా పోరుకు సడలేది లేదని చాటి చెబుతోంది. అయితే తాజాగా జరిగిన చర్చల్లో నాటో లో చేరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరు మూడుసార్లు చర్చలు జరిగాయి. అయితే గతంలో ఓ మీడియా సమావేశంలో చెప్పిన జెలెన్ స్కీ ఇప్పుడు చర్చల్లో చెప్పడం ఆసక్తిగా మారింది. దీంతో యుద్ధం కొనసాగుతుందా...? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి చేస్తున్న ఆ దేశ సైన్యం ఎదుర్కుంటోంది. ఈ పరస్పర దాడిలో రష్యాకు చెందిన 13,500 మంది సైనికులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటి వరకు 404 యుద్ధ ట్యాంకులు, 95 హెలిక్యాప్టర్లు, 81 యుద్ధ విమానాలు, 1279 ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే ఉక్రెయిన్ కు అమెరికాతో పాటు బ్రిటన్, నాటో దేశాలు యుద్ధ సామాగ్రిని అందజేస్తుంది. దీంతో రష్యాపై పోరాడడానికి అనుకూలంగా మారింది.