Begin typing your search above and press return to search.
రష్యా టీవీ చానల్ లో అనూహ్య పరిణామం.. లైవ్ షోలో నిరసన
By: Tupaki Desk | 16 March 2022 6:34 AM GMTప్రశ్నించే గొంతులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటాయి. తాము ఏమైనా ఫర్లేదు.. తమకు అనిపించింది ప్రపంచానికి చాటి చెప్పేందుకు తెగిస్తుంటారు. అందుకోసం తమ జీవితాల్ని సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమవుతారు.
పుతిన్ లాంటి పాలకుడు దేశాన్ని ఏలుతున్న వేళ.. ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న విషయాన్ని తప్పు అని ఎత్తి చూపటమే కాదు.. ప్రపంచానికి తెలిసేలా చేసిన ఒక మహిళ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఆమె ధైర్యం.. సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇంతకూ ఏం జరిగిందంటే..
ఉక్రెయిన్ మీద యుద్ధానికి సై అన్న రష్యా.. గడిచిన మూడు వారాలుగా చేస్తున్న రచ్చ ఎంతన్నది తెలిసిందే. ఒకవైపు తాను నష్టపోతూనే.. మరోవైపు ఉక్రెయిన్ కు కోలుకోని రీతిలో దెబ్బ తీస్తున్న రష్యా తీరును ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాటకు వస్తే.. రష్యాలోని సొంత ప్రజలు సైతం ఉక్రెయిన్ మీద యుద్ధానికి అంత ఆసక్తి చూపటం లేదు.
చాలామంది యుద్ధం చేయటాన్ని నిరసిస్తున్నారు. కాకుంటే.. పుతిన్ లాంటి పాలకుడికి వ్యతిరేకంగా గళం విప్పితే ఎంతటి ఇబ్బందులు ఎదుర్కోవాలో అందరికి తెలిసిందే. అలాంటి సాహసానికి తెర తీసింది మరీనా ఒవ్ శ్యాన్నికోవా అనే మహిళ. తాజాగా రష్యా ప్రభుత్వ టీవీ చానల్ ఆఫీసులోకి ప్రవేశించిన ఆమె.. హడావుడి చేశారు.
ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా రాసిన పోస్టర్ ను పట్టుకొని లైవ్ షో జరుగుతున్న స్టూడియోలోకి దూసుకెళ్లారు. యుద్దం వద్దు.. తప్పుడు వార్తల్ని నమ్మొద్దు.. అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్న ఆమె చానల్ లైవ్ లో కనిపించారు. దీంతో షాక్ తిన్న వారు.. క్షణాల వ్యవధిలోనే లైవ్ షోను నిలిపివేశారు. అప్పటికే.. ఆమె సందేశం యావత్ రష్యాకే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ చేరిపోయింది.
ఇలా ప్రభుత్వ చానల్ ఆఫీసులోకి చొరబడి మరీ.. నిరసన తెలియజేసిన వైనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు హాజరు పరిస్తే.. ఆమెకు జరిమానా విధిస్తూ తీర్పు వచ్చింది. అయితే..ఆ మహిళ తెగువను.. ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభినందనలు తెలియజేశారు.