Begin typing your search above and press return to search.

రష్యాపై ఉక్రెయిన్ డిజిటల్ యుద్ధం..!

By:  Tupaki Desk   |   5 March 2022 2:30 PM GMT
రష్యాపై ఉక్రెయిన్ డిజిటల్ యుద్ధం..!
X
ఉక్రెయిన్ పై రష్యా భయంకరమైన దాడులకు దిగింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. అయితే దీనికి ఉక్రెయిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ సాధ్యమైనంత మేరకు అనేక విధాలుగా రష్యా సేనలను నిలువరించేందుకు తమ దేశ పౌరులను వినియోగించుకుంటుంది. ఈ క్రమంలోనే యుద్ధం సమయంలో ప్రత్యేక సైబర్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది ఉక్రెయిన్.

దీని సాయంతో డిజిటల్ ఆర్మీని ఏర్పాటు చేసింది. కేవలం యుద్ధం అంటే కదనం రంగంలో మాత్రమే జరిగేది కాదని.. డిజిటల్ గా కూడా చేయవచ్చని రుజువు చేస్తున్నాయి. ఇందుకు గాను ఉక్రెయిన్ కు చెందిన ఐటీ నిపుణులను ఇందులో భాగం చేస్తున్నాయి ఉక్రెయిన్ ప్రభుత్వం వర్గాలు. ఇందుకు సంబంధించిన ప్రకటనను కూడా ఆ దేశ ఉప ప్రధాని డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖైలో ఫెదొరోవ్‌ విడుదల చేశారు. ఐటీలో నిష్ణాతులు అయిన ఉక్రెయిన్ లు ఈ మహా క్రతువులో భాగం కావాలని పిలుపునిచ్చారు.

ఈ డిజిటల్ ఆర్మీ అంతా 37 ఏళ్ల ఐటీ ఎగ్జిక్యూటివ్‌ రోమన్‌ జఖరోవ్‌ సారథ్యంలో పని చేస్తోంది. వీరు చేసే పని అంతా.. రష్యన్‌ వెబ్‌ సైట్ల నుంచి వస్తున్న ఫేక్ న్యూన్ ను అడ్డుకోవడం. దీంతో పాటు మరికొన్ని సేవలను అందిస్తుంది. స్టాండ్‌ ఫర్‌ ఉక్రెయిన్‌ పేరుతో వేరు వేరు బృందాలగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉక్రెయిన్ ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే.. మరో వైపు రష్యా చేస్తున్న తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటున్నారు.

దీని కోసం అనేక టెలిగ్రాం చానెళ్లను ఏర్పాటు చేశారు. దీనిలో అనేక మందిని సభ్యులుగా చేర్చారు. దీనితో పాటు రష్యా పన్నుతున్న యుద్ధ తంత్రాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు.

మరో వైపు రష్యా సేనలను నిలువరించేందుకు వారి కుటుంబ సభ్యులకు యుద్ధంలో వారు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తున్నారు. ఇందుకు వారు తీసిన ఫోటోలను వీడియోలను వినియోగిస్తున్నారు. మరి కొన్ని గ్రాఫిక్స్లను కూడా ఇందులో జోడిస్తున్నారు. కేవలం ఐటీ రంగానికి చెందిన నిపుణులు మాత్రమే కాకుండా మరి కొంతమంది కూడా ఇందులో భాగం అయ్యారు.

వారంతా సోషల్ మీడియాలో భాగం అవుతున్నారు. ఉక్రెయిన్ వీధుల్లో జరుగుతున్న దమన కాండను సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నారు. వీటితో పాటే కొన్ని రష్యా వెబ్ సైట్లపై కూడా ఉక్రెయిన్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. బ్యాంకింగ్, రైల్వే, మీడియాల్లో దాడులు జరుతున్నట్లు ఉన్నతాధికారులు ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు.

ఇదిలా ఉంటే రష్యన్లు కూడా ఉక్రెయిన్ చేస్తున్న సైబర్ దాడులు గట్టిగా తిప్పి కొడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన వ్యవస్థ ఉన్న రష్యాలో అత్యుత్తమ హ్యాకర్లు కూడా ఉన్నారు. వారి సాయంతో సైబర్ దాడులకు అడ్డుకట్ట వేస్తుంది రష్యా.