Begin typing your search above and press return to search.

థియేటర్ పై రష్యా ఆరాచకపు బాంబుల దాడి.. 1200 మంది పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   17 March 2022 1:17 AM GMT
థియేటర్ పై రష్యా ఆరాచకపు బాంబుల దాడి.. 1200 మంది పరిస్థితేంటి?
X
యుద్ధమనే ఉన్మాదం మనిషిని పట్టేసిన తర్వాత అంతకంతకూ రాక్షసంగా వ్యవహరించటం తప్పించి మరో మార్గం ఉండదు. తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్దంలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సాధారణంగా ఒక దేశాన్ని దెబ్బ తీయాలన్నదే లక్ష్యమనుకున్ననప్పుడు.. ఆ దేశ ఆయుధ భాండాగారాల్ని.. వ్యూహాత్మక ప్రాంతాల్ని.. స్థానిక ప్రభుత్వాన్ని దెబ్బ తీసే ప్రాంతాల్ని టార్గెట్లుగా ఎంచుకుంటారు. అందుకు భిన్నంగా సాధారణ ప్రజలు.. వారి ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకున్నారంటే.. విషయం పక్కదారి పట్టినట్లేనని చెప్పాలి.

తాజాగా రష్యా సేనలు అలాంటి పనే చేస్తాయి. వెనుకా ముందు చూసుకోకుండా ఉక్రెయిన్ మీద దాడి చేయటం.. వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు.. ఉక్రెయిన్ల ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు. గడిచిన మూడు వారాలుగా సాగుతున్న యుద్ధం తీరును చూస్తే.. మరిన్నిరోజులు ఈ వార్ కొనసాగేట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మేరియు పొల్ లోని ఒక థియేటర్ మీద రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది.

బాంబులు పడే వేళలో థియేటర్ లో 1000 నుంచి 1200 మంది వరకు న్నారని.. ఈ బాంబుల దాడిలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడు పెద్ద ఫ్రశ్నగా మారింది. ఒక అంచనా ప్రకారం.. భారీ సంఖ్యలో ఉక్రెయిన్లు ఈ బాంబు దాడిలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. బాంబుదాడిలో ధ్వంసమైన థియేటర్ చిత్రాల్ని పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీన్ని చూస్తే.. రష్యా ఇంత క్రూరత్వాన్ని ఎలా ప్రదర్శిస్తుందన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన చిత్రాల్ని చూసినప్పుడు రష్యా సేనలు కావాలనే ఈ దారుణ చర్యకు పాల్పడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రష్యా క్రూరత్వం మాటల్లో చెప్పలేనిదిగా చెబుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత మేరియుపొల్ సిటీలో దాదాపు 3 లక్షల మంది చిక్కుకుపోయారని.. వారిని నీళ్లు.. విద్యుత్.. గ్యాస్ సమస్యలు వేధిస్తున్నాయని.. మానవతా సాయం కూడా అందజేయలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెబుతున్నారు. చివరకు వైద్యులు సైతం నిర్బందంలో ఉన్నారని చెబుతున్నారు. వారిని రక్షణ కవచంలా వాడుకొన్న రష్యా దళాలు.. ఆసుపత్రిని తమ అధీనంలోకి తీసుకొచ్చాయని చెబుతున్నారు.

తాజాగా జరిగినదాడిలో కీవ్ లో ఇద్దరు జర్నలిస్టులు దుర్మరణం పాలయ్యారు. వార్తల సేకరణ కోసం వెళ్లిన ఫాక్స్ న్యూస్ పాత్రికేయుల వాహనం మీద దాడి జరగటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రష్యా చేస్తున్న యుద్దంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలతను మూటగట్టుకోగా.. తాజాగా చేస్తున్న దుశ్చర్యలతో వారిపై మరింత ఏహ్య ావం కలిగేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.