Begin typing your search above and press return to search.
44 ఏళ్ళ కెరీర్ లో ఫస్ట్ టైమ్ చంద్రబాబు. .. ?
By: Tupaki Desk | 5 March 2022 3:48 PM GMTచంద్రబాబు తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఇది చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పాలి.
బాబు ఈ మధ్యనే చట్టసభలలో అడుగుపెట్టి 44 ఏళ్ళు పరిపూర్తి చేసుకున్న సంబరాలను చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు చట్టసభకు రాకుండా దూరంగా ఉండడం అంటే విశేషమే. అయితే బాబు ఒక భీకర శపధం చేసి ఉన్నారు కాబట్టి ఆయన దాన్ని అనుసరించి సభకు రాకుండా బయటే ఉండిపోతున్నారు.
ఈ నెల 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబు తప్ప మొత్తానికి మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ, శాసనమండలికి హాజరుకావాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ అత్యున్నత వేదిక అయిన పొలిట్ బ్యూరో దీని మీద సుదీర్ఘమైన చర్చ జరిపిన అనంతరం డెసిషన్ తీసుకుంది.
మొత్తానికి చూస్తే చంద్రబాబు అసెంబ్లీకి దూరంగా ఉండిపోవడం అంటే స్పెషల్ గానే చూడాలి. చంద్రబాబు ఒక్క 1985 ఎన్నికల్లో తప్ప 1978 నుంచి ఈ 2019 వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వచ్చారు. ఈ మధ్యలో ఆయన మంత్రిగా, విపక్ష నేతగా, సీఎం గా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏ నాడూ కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టలేదు.
ఒక విధంగా అసెంబ్లీకి ఠంచనుగా హాజరయ్యే రాముడు మంచి బాలుడు లాంటి టైప్ బాబు. ఎవరు సభకు రాకపోయినా బాబు వచ్చేవారు. ఇక ఫుల్ హోం వర్క్ చేసి మరీ సభలో అనేక ఇష్యూస్ ని రైజ్ చేయడంలో ఆయన దిట్ట. సభలో చంద్రబాబు ఉండడం అంటే ఒక ఆకర్షణ.
అలాంటి బాబు ఈ సభలో ఈసారి కనిపించరు అంటే తమ్ముళ్లకే బెంగగా ఉందిట. ఏది ఏమైనా తన సతీమణి మీద వైసీపీ నేతలు అనుచితమైన కామెంట్స్ చేశారు అన్న దాని మీద ఆగ్రహించి చంద్రబాబు అసెంబ్లీకి రాం రాం అనేశారు. ఒక విధంగా చంద్రబాబు తనకు తాను విధించుకున్న సెల్ఫ్ బాయ్ కాట్ అని చెప్పాలి.