Begin typing your search above and press return to search.
ఫ్లెక్సీ ఏమో కానీ.. పోలీసులకు నెత్తి మీదకు వచ్చేట్టుందిగా?
By: Tupaki Desk | 2 March 2022 10:30 AM GMTఅభిమానం ఒక మోతాదు వరకు ఓకే. హద్దులు దాటితేనే అసలు ఇబ్బంది అంతా. ఇప్పుడు అలాంటి ఫ్లెక్సీ గులాబీ నేతలకు ఇబ్బందిగా మారటమే కాదు.. అసలీ ఫ్లెక్సీ పెట్టినోడికి భారీ క్లాస్ పీకాలన్న మాట వినిపిస్తోంది.
అభిమానంతో అధినేత ఫోటోతో పాటు.. ఆయన రాజకీయ వారసుల పోటోల్ని వరుస పెట్టి పెట్టటం వరకు ఓకే.. ఈ ఉత్సాహంలో అసలు విషయాన్ని మర్చిపోవటం.. పోలీసుల పుణ్యమా అని.. ఇప్పుడు గులాబీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందో ఫోటో. వైరల్ గా మారిన ఈ ఫోటో మీద గులాబీ వ్యతిరేక బ్యాచ్ కు పండుగలా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
మహాశివరాత్రి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నేత ఒకరు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలనుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకోవటం ఎక్కువైన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీని ఏర్పాటు చేసే హడావుడిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోతో పాటు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ఫోటో.. పెద్దసారు ముద్దుల మనమడు హిమాన్షు ఫోటోతో పాటు.. రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఫోటోను పెట్టేశారు.
అందరి ఫోటోలు పెట్టారుకానీ.. పరమ శివుడి ఫోటోను మిస్ అయ్యారు ఎందుకంటే.. శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పే వేళలో శివుడి ఫోటో అంతో ఇంతోఅవసరం కదా. కానీ.. ఆ విషయాన్ని మిస్ అయ్యారు.
ఈ విషయాన్ని అంతో ఇంతో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈ ఎపిసోడ్ లో మరో ఇబ్బందికర అంశం ఏమంటే.. ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన దాని పక్కనే.. హైదరాబాద్ పోలీసులు పండుగ పూట.. కీసరకు వచ్చే భక్తులకు హెచ్చరికలు చేసేలా పోలీసు శాఖకు చెందిన ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓపక్క సీఎం కేసీఆర్ ఫోటో..దాని పక్కనే దొంగలున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
పరమ శివుడి బొమ్మలేని ఫ్లెక్సీ మీద గులాబీ బిగ్ బాస్ మొదలు.. చిన్నబాస్.. బుల్లి బాస్ తో పాటు.. సంతోష్ ఫోటోలు మిస్ కాకుండా ఉన్నాయి కానీ.. శివుడి ఫోటో లేకపోవటం ఒక అభ్యంతరకరమైతే.. సరిగ్గా తమ ఫ్లెక్సీ పక్కనే దొంగలున్నారంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బోలెడంత మంది ముఖాల్లోనవ్వులు పూసేలా చేసిందని చెప్పాలి. వైరల్ గా మారిన ఈ పోలీస్ ఫ్లెక్సీని అలానే ఉంచేస్తే.. అక్షింతలు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.