Begin typing your search above and press return to search.

సారీ సాయిరెడ్డి..! స‌ర్దుకుపోండి ప్లీజ్ !

By:  Tupaki Desk   |   2 March 2022 12:30 AM GMT
సారీ సాయిరెడ్డి..! స‌ర్దుకుపోండి ప్లీజ్ !
X
వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే విజ‌య సాయిరెడ్డి కి రాజ్య స‌భ టికెట్ మ‌రోసారి ల‌భించ‌ద‌నే తెలుస్తోంది. దీంతో పార్టీలో జ‌రిగే మార్పులు ఏ విధంగా ఉన్నా కూడా ఇక‌పై ఆయ‌న మాత్రం పెద్ద‌ల స‌భ‌లో క‌నిపించే అవ‌కాశాలు మాత్రం త‌క్కువే! వ‌చ్చే జూన్ నాటికి ఆయ‌న ప‌ద‌వీ కాలం ముగియనుంది.ఇప్ప‌టికే పార్టీ అనుబంధ విభాగాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కు నిన్న‌నే అప్ప‌గించారు జ‌గ‌న్.

దీంతో ఆయ‌న‌కు మ‌ళ్లీ రాజ్య స‌భ సీటు రాద‌ని కొంద‌రు అంటున్నారు.ఆయ‌న స్థానంలో కొత్తగా ఎవ‌రిని తీసుకోనున్నారో కూడా తెలియ‌డం లేదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం నాలుగు ఎంపీ టిక్కెట్ల‌ను వైసీపీ కైవసం చేసుకోనుంది.ఆ విధంగా చూసుకుంటే సాయి రెడ్డికి బదులు రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచే ఇంకెవ్వ‌ర‌యినా ఆశావ‌హుల‌కు చోటు ఇవ్వ‌నున్నారా అన్న సందేహం కూడా వ‌స్తోంది.ఎప్ప‌టి నుంచో వైవీ త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఆయ‌న‌ను కానీ లేదా జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌ను కానీ ఎంపిక చేయొచ్చు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి ఢిల్లీ ప‌రిణామాలు చూసే బాధ్య‌త‌ను అప్ప‌గించే అవ‌కాశాల‌నూ కొట్టిపారేయ‌లేం.ఇప్ప‌టిదాకా ఉన్న అవినాశ్ కానీ మిథున్ కానీ జ‌గ‌న్ ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా లేరు అని తెలుస్తోంది. వీరిని కాకుండా ఢిల్లీ లో పార్టీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను స‌జ్జ‌ల‌కు అప్ప‌గిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచ‌న కూడా జ‌గ‌న్ చేయ‌వ‌చ్చు.

ఆ విధంగా ఒకనాటి జ‌ర్న‌లిస్టు,ఇప్ప‌టి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి పెద్ద‌ల స‌భ‌కు పోవ‌చ్చు.

ఇక మ‌రో టికెట్ శ్రీ‌కాకుళం జిల్లా కాళింగ సామాజిక వ‌ర్గానికి చెందిన కిల్లి కృపారాణికి వ‌స్తే రావొచ్చు. ఆ విధంగా ఉత్త‌రాంధ్ర‌కు జ‌గ‌న్ న్యాయం చేయొచ్చు. మ‌రో టికెట్ అదానీ గ్రూపున‌కు కేటాయించే అవ‌కాశాలున్నాయి.ఇప్ప‌టికే ప‌రిమ‌ళ్ న‌త్వానికి రాజ్య‌స‌భ సీటు ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచే ద‌క్కింది. ఆయ‌న అంబానీ గ్రూపున‌కు చెందిన వ్య‌క్తి.అదే విధంగా వైసీపీ ప్ర‌భుత్వంతో ఎప్ప‌టి నుంచో వ్యాపార లావాదేవీలు నిర్వ‌హిస్తున్న అదానీ గ్రూపు నిర్వాహ‌కుల్లో ఎవ‌రో ఒక‌రికి రాజ్య‌స‌భ ద‌క్క‌నుంది.వీరితో పాటు కాపు సామాజిక‌వ‌ర్గ నేతల్లో ఎవ‌రో ఒక‌రికి టికెట్ ద‌క్కనుంది.

వీళ్లంద‌రితో పాటు ఇరు రాష్ట్రాల పెద్ద‌ల‌కూ కావాల్సిన వ్య‌క్తి మై హోమ్స్ గ్రూపు సంస్థ‌ల అధినేత రామేశ్వ‌ర‌రావు కు కూడా వైసీపీ నుంచి ప‌ద‌వీయోగం ద‌క్కే అవ‌కాశాల‌ను కొట్టిపారేయలేం. మై హోమ్స్ కు కానీ మెఘా కంపెనీకి కానీ వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌కీయ ప‌ద‌వుల రీత్యా త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌నుంద‌ని తెలుస్తోంది.