Begin typing your search above and press return to search.

కరోనా లేటెస్ట్ వెర్షన్ ఇదే.. ఇప్పుడా దేశాలకు కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   31 Aug 2021 3:44 AM GMT
కరోనా లేటెస్ట్ వెర్షన్ ఇదే.. ఇప్పుడా దేశాలకు కొత్త టెన్షన్
X
కొవిడ్ మహమ్మారి ఎంత డేంజర్ అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లాడికి సైతం కొవిడ్ తీవ్రత ఎంతన్నది అర్థమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మాయదారి వైరస్ కు ఉన్న మరో దరిద్రపుగొట్టు లక్షణం ఏమంటే.. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకోవటం.. మరింత శక్తివంతం కావటం దీనికి అలవాటు. ఇప్పటికే డెల్టా.. డెల్టా ప్లస్ తో పలు దేశాల్లో వణుకు పుట్టించిన ఈ మహమ్మారి.. తాజాగా మరో రూపంలోకి మ్యూటెంట్ అయ్యింది. దీని పేరు సి.1.2గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ ను గుర్తించారు. కరోనాకు చెక్ పెట్టేందుకు అవకాశం ఉందని చెబుతున్న వ్యాక్సిన్లకు సైతం అంతుచిక్కని రీతిలో సవాలు విసరటం తాజా స్టెయిన్ లక్షణంగా చెబుతున్నారు. దీంతో.. ఈ వేరియంట్ వ్యాపిస్తే.. టీకా రక్షణ కూడా పని చేయని పరిస్థితి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్ రక్షణల్ని సైతం అధిగమించి.. చేటు చేసే సామర్థ్యం ఈ కొత్త వేరియంట్ కు ఉందని చెబుతున్నారు. అంతే కాదు.. ఇప్పటి వరకు ఉన్న వేరియంట్ల కంటే రెండు రెట్లు వేగంతో మ్యుటేట్ కావటం మరో లక్షణంగా చెబుతున్నారు.

ఈ ఏడాది మేలో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఇప్పటికే ఈ వేరియంట్ ఇంగ్లండ్.. చైనా.. మారిషస్.. కాంగో.. న్యూజిలాండ్.. పోర్చుగల్.. స్విట్జర్లాండ్ దేశాల్లో విస్తరించింది. డెల్టా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మన దేశానికి మూడో వేవ్ ముప్పు ఉందన్న మాట వినిపిస్తుండటం తెలిసిందే. ఇలాంటివేళ.. ఈ కొత్త వేరియంట్ కానీ వస్తే చాలా ఇబ్బందన్న మాట వినిపిస్తోంది. ఈ వేరియంట్ మన దేశంలోకి అడుగు పెట్టకుండా ఉంటే బెటర్ అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.