Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ ?
By: Tupaki Desk | 25 March 2022 4:06 AM GMTఆట మళ్లీ మొదలు అనాలేమో. జగన్ తనకున్న అనుభవం కన్నా ఈ సారి ధర్మాన అనుభవాన్ని బాగానే వాడుకున్నారు. లెజిస్టేటివ్ స్టేచర్ ను వివరించారు. కాదు కాదు వివరించేందుకు ధర్మానను పురమాయించారు. ఆయన ఎన్నో రోజుల చదువు తరువాత మాట్లాడిన మాటలు అని ఇవి అనిపించకమానవు. కనుక ఆ విధంగా ధర్మాన గ్రేట్.. అంత మంచి వక్తను తనకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడించిన పద్ధతిలో మాట్లాడించిన విధానంలో జగన్ అనే సీఎం కూడా గ్రేట్.
చాలా రోజుల తరువాత అనగా చాలా నాటకీయ పరిణామాల తరువాత అనగా చాలా అంటే చాలా జరిగాక జరిగేందుకు వీలున్న పరిణామాలకు తావిచ్చేలా నిన్నటి వేళ యువ ముఖ్యమంత్రి జగన్ తనదైన శైలిలో మళ్లీ పాత పాటే పాడారు. వైసీపీ సభ్యులలో తెలివికి మారుపేరుగా నిలిచిన ధర్మాన ప్రసాదరావును బాగానే ఉపయోగించుకుని ఓ పెద్ద కథను నడిపారు. సింగిల్ హ్యాండ్ తో ఆ స్టోరీ రాశారు మరియు రాయించారు కూడా! పలికారు మరియు పలికించారు కూడా !
ఓ విధంగా బాహుబలి ఆయనే ఓ విధంగా నిన్నటి వేళ గోండు వీరుడు కొమురం భీముడు అతడే...మన్యం వీరుడు అల్లూరి అతడే ! ఆ విధంగా ఒక్క ఆటకు రెండు సినిమాలు చూపించాడు జగన్. చంద్రబాబుకు చుక్కలు చూపించాడు జగన్.
సినిమా పరిభాషలో రివర్స్ స్క్రీన్ ప్లే అంటారు కదా! ఆ విధంగా సినిమా మొత్తం తనదైన పద్ధతిలో నడిపారు. రాజమౌళికే చుక్కలు చూపించిన, చెమట్లు పోయించిన జగన్ తనదైన పద్ధతికి ఇంకాస్త భిన్నంగా కొత్త రకం కథ ఒకటి తెరపైకి తెచ్చారు. అందుకు సీనియర్ శాసన సభ్యులు ధర్మాన సాయం చేశారు. చాలా పుస్తకాలు తిరగేయడం ఒకటి చేశారు ధర్మాన. ఎప్పటివో కొన్ని కేసులు తవ్వారు.
సుప్రీం ఏం చెప్పిందో చెప్పారు. ఆయనకు ఉన్న అనుభవం కారణంగా చాలా క్లిష్టమయిన విషయాలు సునాయాసంగా చెప్పారు. అది నా బాధ్యత అండి అధినాయకత్వం చెప్పిన విధంగా నేను నా తరఫు వాదన కన్నా జగన్ తరఫు మాటలు మాట్లాడడమే మిన్న అన్న అర్థం వచ్చేవిధంగా వైసీపీ అధినాయకత్వంకు పూర్తి విధేయుడిగా ఉంటూ ధర్మాన మాట్లాడారు. అదే ఇవాళ జగన్ కు మంచి పేరు తెచ్చింది. ఆ మాటలు జాగ్రత్తగా సాక్షి మీడియాలో రాయగలిగితే చాలు జగన్ సక్సెస్.. అదేవిధంగా మరో మీడియా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగి రాస్తే జగన్ డబుల్ సక్సెస్.