Begin typing your search above and press return to search.
టీఢీపీ : లోకేశ్ నిరసనలు ఫలిస్తాయా ?
By: Tupaki Desk | 25 March 2022 6:30 AM GMTగత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సారా మరణాలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతూ అధికార పక్షంపై యుద్ధం చేస్తూనే ఉన్నారు. యుద్ధం ఎలా ఉన్నా కూడా కొన్ని పరిణామాల్లో బాగుంటుంది. కొన్ని రోజుల పాటు కూడా బాగుంటుంది. ఆ విధంగా టీడీపీ పొలిటికల్ మైలేజ్ పెంచేందుకు చినబాబు అయిన లోకేశ్ కృషి చేస్తున్నారు. అసెంబ్లీ లోపల, వెలుపల కూడా తన గొంతుక వినిపిస్తూ తిరుగులేని నేతగా పేరు తెచ్చుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటే అంతా బాగుంటుంది.ఆ విధంగా ప్రతిరోజూ తనదైన ఫస్ట్ ఇంప్రెషన్ ను గేదర్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు చినబాబు.
"కల్తీ సారా, జే బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచారంటూ అసెంబ్లీ ఎదుట శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. సహజ మరణాలు అంటూ సభా వేదికగా నిస్సిగ్గుగా సీఎం అబద్దాలు ఆడటం బాధాకరం. కనీసం ఆఖరి రోజైనా YS Jagan Mohan Reddy హత్యల పై చర్చ చేపట్టాలని కోరుతున్నాం. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. కల్తీ సారా, జే బ్రాండ్లు నిషేధించాలి.." అని నారా లోకేశ్ ఈ ఉదయం (అంటే శుక్రవారం ఉదయం) ఒక పోస్టు ఉంచారు.
ఇక టీడీపీలో మిగతా నాయకులు కూడా జిల్లాల్లో వైసీపీతో వార్ కు సై అంటున్నారు.గతంలో కొన్ని వేధింపులు,అరెస్టులు వగైరా వగైరా పరిణామాలకు భయపడినా ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్న రీతిలో టీడీపీ ఉంది. నాలుగు లాఠీ దెబ్బలకు భయపడిపోతే జగన్ తమకు ఉనికి లేకుండా చేయగలరని భావిస్తూ ఉన్నారు. అందుకే కొందరు నాయకులు గడప దాటి బయటకు వస్తున్నారు.
కొందరు నాయకులు ఇదే మంచి సమయం అని భావించి తమ వారసులను కూడా మీడియా ఎదుట ఫోకస్ లో ఉంచుతున్నారు. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా తండ్రీ కొడుకులు అయిన కలమట వెంకట రమణ, కలమట సాగర్ తిరుగాడుతున్నారు. కలమట వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి పార్టీ మారి రాజకీయం నడిపారు.
దాంతో నియోజకవర్గంలో పరువు పోగొట్టుకున్నారు.కానీ పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేందుకు తాజాగా మారుతున్న పరిణామాలను తనకు అనుగుణంగా మలుచుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. ఇదే విధంగా చాలా మంది ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉన్నారు. కొందరు లోకేశ్ స్ఫూర్తితో మొద్దు నిద్ర కూడా వీడి జనంలోకి వస్తున్నారు. దీంతో లోకేశ్ కూడా తన జోరు పెంచుతున్నారు. ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేందుకు సన్నద్ధం అవుతున్నారు. మధ్య మధ్యలో సెటైర్లు వేస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తున్న చిన బాబు ప్రయత్నాలు రేపటి వేళ అనగా ఎన్నికల వేళ ఫలిస్తాయా?