Begin typing your search above and press return to search.
జీవోలో ఈ మెలికలు ఎవరి కోసం?
By: Tupaki Desk | 8 March 2022 11:35 AM GMTఏపీ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా టికెట్ రేట్లకు సంబంధించిన 35 జీవోని విడుదల చేసి పెద్ద చిత్రాలని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మొర పెట్టుకోవడం.. మెగాస్టార్ చిరంజీవి ముందుకు నడిచి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రత్యేకంగా కలవడంతో ప్రభుత్వంలో మార్పు వచ్చింది. ఇండస్ట్రీని కరుణించింది. టికెట్ రేట్లపై ప్రవేశ పెట్టిన పాత జీవో నం.35ని రద్దుచేస్తూ .. టికెట్ ధరలు పెంచుకునే విధంగా కొత్త జీవోని తీసుకొచ్చింది.
దీంతో టాలీవుడ్ హ్యాపీ అనే సంకేతాలు వినిపించాయి. కానీ మధ్యలో చిన్న ట్విస్ట్. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుని కల్పిస్తూనే ఊపి ప్రభుత్వం అందులో కొత్త మెలికల్ని చేర్చింది. ఇప్పుడిది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సవరించిన జీవోలో మెలికలు పెట్టినట్టుగా స్పష్టమవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఐదవ షోకు అనుమతి ఇస్తూనే ఒక షోని చిన్న సినిమాకు కేటాయించాలంటూ మెలిక పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఐదవ షో అన్నది పెద్ద సినిమాలకు అడ్వాంటేజ్. ఆ షోనే చిన్న సినిమాకి కేటాయించాలని మెలిక పెట్టడం వెనకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదట. సినిమా క్రేజ్ ని బట్టి షోలు పెంచుకునే వీలుని కల్పిస్తే ఐదవ షో పెద్ద సినిమాకే అడ్వాంటేజ్ గా మారుతుంది.
పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న చిత్రాలని విడుదల చేయడానికి ఏ నిర్మాత సాహసించడు. అలాంటప్పుడు చిన్న సినిమా వుండే అవకాశమే లేదు. ఇక ఐదవ షో కు చిన్న సినిమా ఎక్కడ వుంటుందో వారికే తెలియాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.
ఇక పెద్ద సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని కలిపిస్తూనే 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమాలకు మాత్రమే ఆ వెసులుబాటు అన్నారు. అంతే కాకుండా అది కూడా ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకుని వున్న సినిమాకు మాత్రమే అంటూ మరో మెలిక పెట్టారు. అవసరానికి తగ్గుట్టుగా మార్చుకున్నట్టుగా వున్న ఈ జీవో వుందని, ఇన్ని మెలికలతో వున్న ఈ జోవో ఎవరికి ఉపయోగపడుతుందో ప్రస్తుతం ఏ హీరో అర్థం చేసుకోలేకపోతున్నాడని ఇండస్ట్రీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా విడుదల చేసిన జీవోలోని మెలికలు కొంత మంది హీరోలని బట్టి మారే అవకాశం వుందని, నచ్చి హీరో సినిమా అయితే నిబంధనల్ని పక్కన పెట్టేసి చూసీ చూడనట్టుగా వెళ్లడం.. నచ్చని హీరో అయితే ఇవే నిబంధనల్ని మరింత కఠనతరం చేసి షాకిచ్చినా ఆశ్చర్యపడనక్కరలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఓలోని లొసుగులు స్పష్టంగా తెలిశాయి కాబట్టే స్టార్ హీరోలు తాజా జీవోపై స్పందించలేదని చెబుతున్నారు.