Begin typing your search above and press return to search.

ఏన్నాళ్లకీ నవ్వులు.. ఎమ్మెల్సీ ఫలితం వెలువడినంతనే కేసీఆర్ రియాక్షన్ చూశారా?

By:  Tupaki Desk   |   21 March 2021 4:18 AM GMT
ఏన్నాళ్లకీ నవ్వులు.. ఎమ్మెల్సీ ఫలితం వెలువడినంతనే కేసీఆర్ రియాక్షన్ చూశారా?
X
కష్టపడి చదివిన పరీక్షకు.. పేపర్ టఫ్ గా వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రశ్నాపత్రాన్ని పట్టుదలతో రాసి.. ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. తొంభై మార్కులకు పైనే మార్కులు వస్తే ఎలా ఉంటుంది? రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబుల్ విజయం తర్వాత గులాబీ బాస్ మూడ్ ఎలా ఉందనటానికి ఈ ఉదాహరణ సరిపోతుందని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత.. కేసీఆర్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. రోటీన్ కు భిన్నంగా ఆయన తన ఆనందాన్ని అస్సలు ఆపుకోలేదు. అభినందనలు తెలపటానికి వచ్చిన నేతలతో ఆయన మరింత హుషారుగా పలుకరించారు.

ఇక.. గెలుపుపై ఆయన ఆనందం.. ఆయన ముఖంలో కనిపించిన వెలుగులే నిదర్శనం. పట్టలేని ఆనందంతో ఉన్న కేసీఆర్ మోమును చూస్తే.. ఇటీవల కాలంలో ఇంత ఆనందంగా ఆయన ఎప్పుడూ ఉన్నట్లుగా కనిపించదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన నేపథ్యంలో హైదరాబాద్ అభ్యర్థి వాణీదేవి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటానికి ప్రగతి భవన్ కు వెళ్లారు. అప్పటికే పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖంలో నవ్వులు చూసినప్పుడు.. సారు ముఖంలో ఇంత భారీగా నవ్వులు ఇటీవల కాలంలో తామెప్పుడూ చూడలేదన్న మాట కేసీఆర్ సన్నిహితుల నోటి నుంచి వినిపించటం గమనార్హం.

డబుల్ విజయం తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉందన్న దానికి.. తాజా ఫోటో నిలువెత్తు రూపంగా చెప్పొచ్చు. మాంచి హుషారుతో కనిపించిన ఆయన.. కొండను కొట్టినంత ఆనందంగా ఉన్నట్లుగా చెప్పాలి. తమకు ఏ మాత్రం అచ్చిరాని హైదరాబాద్ ఎమ్మెల్సీ కొండను ఎట్టకేలకు ఢీ కొట్టి.. విజయం సాధించిన వేళ.. ఆయనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా చెప్పాలి. పోరాడి గెలిచినప్పుడు వచ్చే ఆనందం ఎంత ఉంటుందో.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్ని గెలుచుకున్నప్పుడు సీఎం కేసీఆర్ రియాక్షన్ అందుకు ఏ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించినంత ఫలితం రాని వేళ.. అనుకోని రీతిలో రెండుస్థానాల్ని వ్యూహాత్మకంగా గెలుచుకోవటంలో కేసీఆర్ కీలక భూమిక పోషించారని చెప్పక తప్పదు.