Begin typing your search above and press return to search.

విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం..ఒకేసారి తొమ్మిది - అద్భుతం చేసిన కాస్మిక్ గర్ల్‌!

By:  Tupaki Desk   |   18 Jan 2021 11:30 PM GMT
విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం..ఒకేసారి తొమ్మిది - అద్భుతం చేసిన కాస్మిక్ గర్ల్‌!
X
ఇప్పటివరకు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ( పీఎస్ ఎల్ ‌వీ) వంటి రాకెట్ లాంఛర్లను ఉపయోగించడాన్ని చూశాం. దీనికి భిన్నంగా ఓ విమానం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడమే విషయం ఊహకు కూడా అందకపోవచ్చు. అలాంటి ఊహాజనిత ప్రయోగానికి అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు పౌర విమానయాన సంస్థ వాస్తవ రూపాన్ని ఇచ్చింది. బోయింగ్ 747 విమానం ద్వారా ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది వర్జిన్ ఆర్బిట్. అంతరిక్ష ప్రయోగాలను సాగించడానికి ఏర్పాటైన స్టార్టప్ కంపెనీ అది. కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా పని చేస్తోన్న ఆ కంపెనీ, ఈ ఘనతను అందుకుంది.

బోయింగ్ 747 విమానం ద్వారా తొమ్మిది రాకెట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాస్మిక్ గర్ల్‌గా ముద్దగా పిలుచుకునే ఈ విమానం ఎడమ రెక్కకు ఓ మిస్సైల్ సైజ్‌ లో ఉన్న రాకెట్‌ ను అమర్చారు. వాటికి ఈ తొమ్మిది నానో ఉపగ్రహాలను జత చేశారు. ఈ రాకెట్ లాంచర్‌ ను మోసుకెళ్లిన కాస్మిక్ గర్ల్ బోయింగ్ 747 విమానం. పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణించింది. ఆ విమానం నిర్దేశిత లక్ష్యానికి చేరుకున్న తరువాత ఆ మిస్సైల్‌ ను ఎజెక్ట్ చేసింది. గంటకు 17 వేల మైళ్ల వేగంతో ప్రయాణించిన ఆ మిస్సైల్, నిర్ణీత సమయానికి, నిర్దేశిత భూకక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.

వర్జిన్ ఆర్బిట్ చేపట్టిన తొలి ప్రయోగం ఇదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌ కు లాంచర్ వన్ అని పేరు పెట్టారు. నాసా రూపొందించిన ఎడ్యుకేషన్ నానో శాటిలైట్లను విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వర్జిన్ ఆర్బిట్ తెలిపింది. విద్యార్థులను ప్రోత్సహించడానికి నాసా చేపట్టిన కాంపిటీషన్‌లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు ఈ తొమ్మిది ఉపగ్రహాలను రూపొందించారు. వారే సొంతంగా వాటిని డిజైన్ చేశారు. విమానం గమనాన్ని వారు యూనివర్షిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా, యూనివర్శిటీ ఆఫ్ లూసియానా నుంచి పర్యవేక్షించారు. అంతరిక్ష ప్రయోగాల కోసం ఆవిర్భవించిన మూడో ప్రైవేటు కంపెనీగా వర్జిన్ ఆర్బిట్ గుర్తింపు తెచ్చుకుంది