Begin typing your search above and press return to search.
పాత ప్రచారానికి పాతరేయండి..మండే ఎండలోనే కరోనా?
By: Tupaki Desk | 13 March 2020 9:15 AM GMTకరోనా పేరు చెప్పినంతనే.. తెలిసిన విషయాల కంటే తెలియని విషయాల మీదే ప్రజలు ఎక్కువగా మాట్లాడటం కనిపిస్తుంటుంది. కరోనా విషయంపై దేశీయంగా చూస్తే.. చాలామంది సింఫుల్ గా కొట్టి పారేస్తుంటారు. కంటికి కనిపించని ఈ వైరస్ కారణంగా మన దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని.. మనకున్న అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కరోనా బతికి బట్టకట్టదన్న విషయాన్ని చెబుతుంటారు. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారం ఏమీ లేకున్నా.. కరోనా వార్తలు వచ్చిన తొలినాళ్లలో మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. భారత్ లోని అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ మాయదారి వైరస్ బతికి బట్టకట్టదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.
అయితే.. ఇది ఉత్త ప్రచారమే తప్పించి.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. మండే వేసవిలో.. అత్యధిక ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ బతకదన్నది పాత ప్రచారమని.. అందులో వాస్తవం అస్సలు లేదన్న విషయాన్ని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. వీరి మాటల్ని నిజం చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు.
వేసవిలో.. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో కరోనా వైరస్ బతకదన్న ప్రచారం సరికాదని.. అదే వాస్తవమని ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేమన్నారు. ఆ విషయం నిర్దారణ కాలేదంటున్నారు. మండే ఎండలున్న ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉండన్నట్లైయితే.. దుబాయ్ తో అరబ్ ఎమిరేట్స్ తో పాటు దక్షిణాసియాలో ఈ వైరస్ తీవ్రత ఎందుకు ఎక్కువ అవుతుందన్న లాజిక్ క్వశ్చన్ వేసుకుంటే.. విషయం ఇట్టే అర్థం కాక మానదు.