Begin typing your search above and press return to search.
రోజు కరోనా వివరాలు వెల్లడించేది మనోడే..
By: Tupaki Desk | 13 April 2020 6:00 AMప్రతి రోజు సాయంత్రం మీడియా సమావేశానికి హాజరై దేశవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ వివరాలు వెల్లడిస్తారు. దేశంలో కరోనా వైరస్ స్థితి ఎలా ఉంది? ఎన్ని చోట్ల వ్యాపించింది? ఎన్ని యాక్టివ్ ఉన్నాయి? ఎంతమంది డిశ్చార్జయ్యారో తదితర వివరాలు దేశ ప్రజలకు అందిస్తున్న వ్యక్తి లవ్ అగర్వాల్. ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి గా ప్రస్తుతం పని చేస్తున్నారు. కానీ ఆయనకు తెలుగు రాష్ట్రాలతో విశేష అనుబంధం ఉంది.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన బాధత్యలు మరింత పెరిగాయి. సాధారణ విధులతో పోలిస్తే కరోనా వైరస్ గురించి దేశవ్యాప్తంగా ఆరా తీయడం, కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రాలకు ఆదేశాలు అందించడం ఆయన నిరంతరం చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి కావడం విశేషం. 1996 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్ తెలుగు చక్కగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. విభజన అనంతరం తెలంగాణలోనూ పని చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఆయన పని చేశారు. తనదైన రీతిలో పని చేసి మంచి పేరు సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణ క్రీడలు, యువజన శాఖ కార్యదర్శిగా పని చేశారు. అనంతరం డిప్యుటేషన్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఆనాటి నుంచి ఇప్పటివరకు అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఈ సమయంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయన కీలకమైనది. సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ కరోనాపై ఎప్పటికప్పుడు తాజా వివరాలు అందిస్తున్నారు. లవ్ అగర్వాల్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన అధికారిగా తెలుగు ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయడం విశేషం.