Begin typing your search above and press return to search.
శాడిస్ట్ భర్త: భార్యను ఘోరంగా చితకబాదిన వీడియో వైరల్
By: Tupaki Desk | 28 Jun 2020 10:10 AM GMTప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పిల్లలు కావడం లేదని తీవ్రంగా వేధింపులు.. భౌతిక దాడి చేయడంతో వాటిని తట్టుకోలేక సొఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భార్య పట్ల భర్త ప్రవర్తించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించేలా ఉంది. ఆమెపై దాడి చేస్తుండగా ఆమె పెంచుకుంటున్న కుక్క అతడిని కరిచేందుకు వెళ్లింది. కుక్కకు ఉన్న ప్రేమ.. విశ్వాసం లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఆ నిందితుడిని శిక్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. లేదా సజ్జనార్ అతడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. భర్త వెంకటేశ్వరరావు ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి లావణ్య, వెంకటేశ్వరరావు. వీరిద్దరూ ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో పైలట్ గా పని చేస్తుండగా లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండేది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని సీఎస్కే విల్లాలో నివసిస్తున్నారు. ఎమిదేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. దీనిపై కుటుంబసభ్యులు.. భర్త లావణ్యను వేధిస్తున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను తీవ్రంగా దూషిస్తూ దాడులు చేస్తున్నాడు.
దీంతోపాటు వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉంటున్నడు. ఆమెనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. భర్త వేధింపులు.. మరో పెళ్లి.. అత్తామామల వేధింపులు కూడా తోడవడంతో లావణ్య మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. దాంతో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆమె శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది.
లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లుడు.. వారి అత్తామామల వేధింపులతో ఆమె మృతి చెందిందని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భర్త వేధింపుల వీడియో చూసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. భర్తను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా అతడి తల్లిదండ్రులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మహిళలతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని ఉరి తీయాలని.. ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.