Begin typing your search above and press return to search.
ఢిల్లీలోని కార్యాలయాలన్నీ మూత: తాజాగా శాస్త్రిభవన్ మూసివేత
By: Tupaki Desk | 5 May 2020 11:50 AM GMTకరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. నెలన్నరగా చేపట్టిన లాక్‌డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నా ఆ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఆ వైరస్‌తో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడుతున్నాయి. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ కరోనాతో మూసివేస్తున్నారు. నీతి ఆయోగ్ భవన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్న రాజీవ్ గాంధీ భవన్, సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం, బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం కొంత భాగం మూసివేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని శాస్త్రి భవన్ మూసివేశారు. పలు మంత్రిత్వ శాఖలు ఉండే ఆ భవన సముదాయానికి తాళం వేశారు. ఎందుకంటే ఓ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారికి కరోనా పాజిటివ్ వచ్చింది. అనేక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు శాస్త్రి భవన్‌లో ఉన్నాయి. తాజాగా ఒకరికి కరోనా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో కార్యాలయాన్ని మూసేసి శానిటైజేషన్ కోసం సీలు చేశారు.
ఈ క్రమంలో కరోనా పాజిటివ్ ఉద్యోగితో కాంటాక్ట్ అయిన వ్యక్తులందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు. గేట్ నంబర్ 1 నుంచి గేట్ నంబర్ 3 వరకు, నాల్గో అంతస్తులో ఉన్న 'ఎ' వింగ్ సీలు చేశారు. శానిటైజింగ్ పనులు జరుగుతున్నాయని - కొన్ని గేట్లు - లిఫ్ట్ లు కూడా బుధవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం శాస్తీ భవన్ లో ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన జాగ్రత్తలన్నీ పాటించి చర్యలు తీసుకుంటున్నారు.
శాస్త్రి భవనాన్ని 48 గంటల పాటు మూసేసి జాగ్రత్త చర్యలు చేపట్టారు. శానిటైజ్ పనులు చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు ఈ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. అలాంటి కార్యాలయం ఇప్పుడు సడెన్‌గా మూతపడింది. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీ చర్చలు ఊపందుకున్న కీలక సమయంలో అక్కడి అధికారులు సిబ్బంది క్వారంటైన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.