Begin typing your search above and press return to search.
ఆ సైట్లు చూసి.. అడ్డంగా బుక్ అయిన నేత
By: Tupaki Desk | 11 Jun 2017 9:13 AM GMTచేసేది ఎదవ పని అయినప్పుడు.. అదెప్పటికైనా బయటకు రావాల్సిందే. గుట్టుగా ఎంత దాచాలని చూసినా.. ఏదో ఒక రోజున ఏదో ఒకరకంగా బయటకు రావటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అమెరికాకు చెందిన నేత ఒకరు.
బూతుసైట్లను చూసే అలవాటున్న ఆయన తీరు డాక్యుమెంటు సాక్షిగా అడ్డంగా బుక్ కావటమే కాదు.. పలువురి చేత తిట్లు తింటున్నారు. బూతుసైట్లు చూస్తూ ఆయనెలా దొరికిపోయాడన్నది చూస్తే.. మరీ ఇంత నిర్లక్ష్యమా అనిపించక మానదు. అమెరికాకు చెందిన రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి చెందిన రామన్ పెరీజ్ అనే నేత హౌస్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీకి చెందిన పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్ల స్క్రీన్ షాట్లను అందజేశారు. అయితే.. అయ్యగారు ఇచ్చిన డాక్యుమెంట్లలో.. తాను చూసే సైట్లకు సంబంధించిన ట్యాబ్ లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. అందులో పోర్న్ సైట్లు కూడా ఓపెన్ అయ్యి ఉండటం అందులో స్పష్టంగా ఉంది. డాక్యుమెంట్లను స్క్రీన్ షాట్లు తీసుకునే వేళలో ఓపెన్ చేసిన ట్యాబ్ లను క్లోజ్ చేయటం కానీ.. లేదంటే.. అవి రాకుండా ఉండటం మీదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవటంతో అయ్యగారి అలవాట్లకు సంబంధించి సాక్ష్యాలతో సహా దొరికిపోయినట్లుగా అయ్యింది.
యుఎస్ వంటి దేశాల్లో పోర్న్ వాచింగ్ సర్వ సాధారణమే కానీ కీలకమైన డాక్యుమెంట్ల తయారీ వేళలో.. అలాంటి సైట్లు చూడటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తన బూతు వ్యవహారం బయటకు వచ్చేయటంతో తల కొట్టేసినట్లుగా ఫీలైన ఆయన.. కొత్త వాదనను వినిపించటం మొదలు పెట్టారు. తన పొరపాటు వల్ల తాను పంపిన డాక్యుమెంట్లో అసభ్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయని.. తనను క్షమించాలని కోరారు. తనకు అప్పగించిన పనిని తన స్నేహితుడికి అప్పగించానని.. అతడు చేసిన పని తనకు ఆలస్యంగా అర్థమైందని చెప్పుకొచ్చారు. మొత్తానికి బాగానే కవర్ చేస్తున్నట్లుగా లేదూ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/