Begin typing your search above and press return to search.
వివాదాస్పద భారతీయ అమెరికన్ వెబ్‌సైట్ యజమానిపై దావా
By: Tupaki Desk | 21 Jun 2022 5:32 AM GMTఇండో-అమెరికన్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు విశాల్ గార్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది డిసెంబర్ లో 900 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆన్ లైన్ తాకట్టు కంపెనీ 'బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ 'జూమ్ వీడియో కాల్ ప్రకటన చేయడం అప్పట్లో సంచలనమైంది. ఈ పరిణామంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే అప్పట్లో ఉద్యోగం కోల్పోయిన కంపెనీ సేల్స్ అండ్ ఆపరేషన్స్ మాజీ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ సారా పీయర్స్ తాజాగా ప్రస్తుతం కోర్టులో దావా వేశారు. ఈ ఓనర్ పై కోర్టులోనే నష్టపరిహారం పొంది తగిన బుద్ది చెప్పేందుకు రెడీ అయ్యారు.
సాఫ్ట్ బ్యాంక్ సారథ్యంలోని 'బెటర్.కామ్' ఓ బ్లాంక్ చెక్ కంపెనీలో విలీనానికి 7.7 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందాన్ని త్వరగా ముగించాలనే ఉద్దేశంతో అనేక తప్పుడు చర్యలకు విశాల్ గార్గ్ పాల్పడ్డారని పేర్కొన్నారు. పెట్టుబడిదారులను విశాల్ గార్గ్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పిటీషన్ లో సారా పీర్స్ పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం ఇప్పటికీ పూర్తవ్వలేదని కోర్టుకు వివరించారు.
ఈ ఒప్పందం ప్రతిపాదన నాటి నుంచి గార్గ్ వివాదాస్పద చర్యలు, తాకట్టు రేట్ల పెంపుతో కంపెనీ ప్రతిష్ట, వ్యాపారం దెబ్బతిన్నాయని సారా వివరించింది. విలీన ఒప్పందం పూర్తికి కంపెనీ ప్రకటనలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
బెటర్.కామ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడంతో ఈ విధంగా వ్యవహరించారని పిటీషన్ లో పేర్కొన్నారు. కాగా ఈ వ్యాజ్యంపై సాఫ్ట్ బ్యాంక్ ఇంతవరకూ స్పందించలేదు.
అమెరికాలోని డిస్ట్రిక్ కోర్టులో ఈ పిటీషన్ నుద ాఖలు చేశానని సారా పియర్స్ తెలిపింది. ఫిబ్రవరిలో జరిగిన విలీన ఒప్పందం తన తొలగింపునకు కారణమని భావిస్తున్నట్టు చెప్పారు. తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఆమె కోర్టును కోరారు.
భారీ వడ్డీ రేట్లు ఉన్నాయనే వాతావరణాన్ని సృష్టించేలా విశాల్ గార్గ్ తప్పుదోవ పట్టించారని ఆమె ఆరోపించారు. బలమైన కారణం లేకుండా తమను తొలగించాలరని ఆమె చెప్పారు.
43 ఏళ్ల గార్గ్ 2016లో Better.comని స్థాపించారు. దీనికి జపనీస్ బ్యాంక్ అయిన సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉంది. గత వారం పెట్టుబడిదారుల నుండి $750 మిలియన్ల నగదును సమీకరించారు. ఇటీవల $7 బిలియన్ల విలువను ఈ కంపెనీ పొందింది.