Begin typing your search above and press return to search.
11.20 లక్షలకి దావూద్ ఇబ్రహీం ఇల్లు కొన్న లాయర్ శ్రీవాస్తవ్ !
By: Tupaki Desk | 11 Nov 2020 11:30 PM GMTప్రపంచాన్ని వణికించిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ‘ఇబ్రహీం మ్యాన్షన్’ తో పాటు మరో ఐదు స్థిరాస్తులను మంగళవారం నాడు వేలం వేశారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో ఈ ఇంటిని ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ్ రూ. 11.20 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ఇల్లు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో ఉంది. దావూద్ కుటుంబం 1983లో ముంబైకి వెళ్లకముందు ఇదే ఇంటిలో నివాసం ఉన్నది.
ఇక దావూద్ తల్లి అమీన్ బీ, సోదరి హసీనా పర్కార్ పేరిట ఉన్న 25 గుంటల భూమిని కూడా శ్రీవాస్తవే కొన్నారు. ఇందుకోసం ఆయన 4.30 లక్షల రూపాయలు చెల్లించారు. ఇక రత్నగిరి జిల్లాలోని లోటే గ్రామంలో ఉన్న ఓ ప్లాట్ టెక్నికల్ రీజన్స్ తో అమ్ముడు పోలేదు. అలాగే దావూద్ సన్నిహితుడు ఇక్బాల్ మిర్చి ఫ్లాట్ కూడా అమ్ముడుకాలేదు. ఈ రెండింటిని మళ్లీ వేలం వేయనున్నారు.
దావూద్ ఆస్తులను కొనడం వెనుక ఇష్టమేమీ లేదని, తాము అతడిని భయపడటం లేదని చెప్పడానికే కొన్నానని శ్రీవాత్సవ అంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అన్నారు. దావూద్ ఆస్తులను గతంలో వేలం వేసినప్పుడు కూడా శ్రీవాస్తవ కొనుగోలు చేశారు. అప్పట్లో దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చినా శ్రీవాత్సవ లెక్క చేయలేదు. ఈ విషయంలో ఏజెన్సీలకు కూడా సహాయ పడుతామని చెప్పారు. ఉగ్రవాదం పేరుతో అమాయక ప్రజలను చంపడం దారుణమన్నారు.