Begin typing your search above and press return to search.
అసెంబ్లీని అదెక్కివ్వండి.. పుట్టిన రోజు చేసుకుంటాం!!
By: Tupaki Desk | 23 Dec 2022 12:30 AM GMTఎంత డబ్బున్నవారైనా.. ఎంత పలుకుబడి ఉన్నవారైనా.. తమ వ్యక్తిగత కార్యక్రమాల కోసం.. అసెంబ్లీలను.. పార్లమెంటును వాడుకోవడం.. ఎక్కడా చూడలేదు. అయితే.. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఇవి కూడా చోటు చేసుకున్నాయి. ఒక మంత్రి తన పుట్టిన రోజును అసెంబ్లీలో చేసుకున్న విషయం ఉత్తరాఖండ్‌లో జరిగింది. బహుశ దీనిని చూసి ప్రేరణ పొందారో ఏమో.. ఓ వ్యక్తి.. కర్ణాటక అసెంబ్లీని అద్దెకు ఇవ్వాలని విన్నవించారు.
బెళగావి జిల్లా గోకాక్ తాలూకా ఘటప్రభ నివాసి లాయర్ మల్లికార్జున చౌకశీ.. తన కూతురు పుట్టిన రోజును జరుపుకోవడానికి సువర్ణసౌధ(కర్ణాటక అసెంబ్లీ)ను అద్దెకు ఇవ్వాలని స్పీకర్కు, జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. తన ఒక్కగానొక్క కూతురు మణిశ్రీ ఐదో పుట్టినరోజును గుర్తుండి పోయే విధంగా జరపాలనుకుంటు న్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
"నా ఒక్కగానొక్క కూతురు మణిశ్రీకి జనవరి 30న 5వ సంవత్సరం పూర్తవుతుంది. ఆమె 1వ తరగతిలో ప్రవేశం పొందబోతుంది. ఇది ఆమె జీవితంలో అమూల్యమైన క్షణం. అందుకే ఆమె పుట్టినరోజు జరుపుకు నేందుకు కర్ణాటక సువర్ణసౌధను నాకు ఒక రోజు అద్దెకు ఇవ్వండి.ఎంతైన ఆఫర్వాలేదు.. చెల్లిస్తాను`` అని జిల్లా కలెక్టర్కు, స్పీకర్కు అభ్యర్థించారు.
నాలుగు అంతస్తుల సువర్ణ సౌధ భవనం కర్ణాటక శాసనసభ సమావేశాలను నిర్వహించడానికి సంవత్సరా నికి ఒకసారి(ఏటా శీతాకాలంలో) మాత్రమే ఉపయోగిస్తారు. ఆ పదిరోజులు సభ జరిపేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది.
ఈ ఖర్చులకు తగ్గట్టుగా దానిని సాధారణ సమయాలలో అద్దెకు ఇస్తే బాగుంటుందని.. తద్వారా నిర్వహణ ఖర్చులను ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు మల్లికార్జున. సభా సమావేశాలు కూడా కొనసాగుతాయని, దీనిపై సభలో చర్చించి అద్దెకు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.