Begin typing your search above and press return to search.
కోర్టుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘జై భీం’ రియల్ చంద్రు..
By: Tupaki Desk | 11 Dec 2021 12:00 PM ISTలాయర్ చంద్రు.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జై భీమ్’ సినిమా ద్వారా ఆయన పాపులర్ అయ్యారు. ఈ సినిమా మొత్తం రియల్ లాయర్ చంద్రు చెప్పిన స్టోరీ ఆధారంగా తీసినదే. దీంతో ఈ విషయం తెలిసిన జనాలు ఆయనతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ అయిన చంద్రు ఆయన లాయర్ జీవితంలో ఎన్నో సంఘటనలు చూశారు.
అయితే న్యాయవ్యవస్థలోనూ కొన్ని లోపాలున్నాయని సున్నితంగా విమర్శలు చేశారు. వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రత్యర్థులతో కాకుండా న్యాయ వ్యస్థతో కూడా పోరాడాల్సిన సమయం వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘జై భీమ్’ సినిమా మొత్తంగా హీరో చంద్రు క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తోంది. కామన్ సినిమాల్లో కాకుండా ఇందులో హీరో ఓ సమస్యపై పోరాటం చేస్తారు. కొన్ని రోజుల వరకు ఇది రియల్ స్టోరీ అన్న విషయం తెలియదు.
రియల్ గా లాయర్ చంద్రు పోరాటం చేసిన అంశాలే సినిమాలో చూపించారు. అయితే ఇటీవల రియల్ లాయర్ చంద్రూ కూడా మీడియాలో కనిపిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ , కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆయన న్యాయవ్యస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ ప్రతీ కోర్టు తమ పరిధి తెలుసుకోవాలి. మిగతా వ్యవస్థల మాదిరిగానే కోర్టుకు పరిమితులుంటాయి. మానవ హక్కుల కోసం కోర్టులు పనిచేయాలి. కొన్ని పనులు కోర్టు ఆదేశాలతో జరుగుతున్నాయి. ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు.
న్యాయవాదులకు రాజ్యంగమే ఆయుధం. డబ్బుకోసం కాకుండా హక్కుల కోసం పనిచేయాలి. బాధితులకు సరైన న్యాయం చేస్తేనే అసలైన తృప్తి ఉంటుంది. ప్రభుత్వానికి ,న్యాయవ్యవస్థకు అంతరం ఉండడం మంచిది కాదు. అన్ని వ్యవస్థలు ప్రభుత్వం పరిధిలో పనిచేయాలి. చట్టసభల్లో చేసిన చట్టాలను న్యాయ వ్యవస్థకు చెప్పకుండానే ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో న్యాయవ్యవస్థ మరో రకంగా నడుస్తోంది.’ అని చెప్పారు.
‘ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును చేసిందని కొందరు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులను విచారించే న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని ప్రభుత్వం పిటిషన్ వేసింది.
దీంతో ఈ కేసులను మరో బెంచ్ కు మార్చాలని కోరారు. దానికి ఆ న్యామూర్తులు మేమే ఈ కేసును విచారిస్తాం అని అన్నారు. న్యాయవాదులు అలా చెప్పడంలో అంతర్యమేమిటి..? ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ ఉంటుంది..?’ అని చంద్రు వ్యాఖ్యానించారు.
హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చని చంద్రు అభిప్రాయపడ్డారు. అయితే ఉత్తర్వులు మాత్రం ఇవ్వరాదన్నారు. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం కొన్ని సందర్భాల్లో తాము చెప్పిన తీర్పులు తప్పని క్షమాపణలు చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి వారు మరింతమంది ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నానని చంద్రు అన్నారు.
సామాజిక మాధ్యమాలను ఆధారంగా చేసుకొని కేసులు పెట్టడం, విదేశాలకు దర్యాప్తు కోసం అధికారులను పంపడం కరెక్ట్ కాదని చంద్రు అన్నారు. బాధితులకు సరైన న్యాయం అందించేందుకు ఇవి ఉపయోగపడవన్నారు. టెక్నాలజీని వాడుకోవాలని గానీ.. సోషల్ మీడియా ప్రాముఖ్యతను చూపించొద్దన్నారు.
ఇదే సమయంలో అన్యాయానికి గురవుతున్న వ్యక్తి కోసం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా లాయర్ చంద్రు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.