Begin typing your search above and press return to search.

చైన్నైలో లాయర్ ను నడిరోడ్డు మీద ఏసేశారు

By:  Tupaki Desk   |   23 Jun 2016 11:53 AM GMT
చైన్నైలో లాయర్ ను నడిరోడ్డు మీద ఏసేశారు
X
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో ఒక దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా.. ఒక లాయర్ ను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీదనే చంపేయటం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సత్యమూర్తి ప్రాంతానికి చెందిన రవి అనే లాయర్ గురువారం స్కూటర్ మీద వెళుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని బైక్ మీద ఫాలో అయ్యారు.

అనంతరం బైక్ తో ఢీ కొట్టిన దుండగులు.. లాయర్ మీద దాడికి పాల్పడి.. అందరూ చూస్తుండగానే దారుణంగా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సదరు లాయర్ ను హుటాహుటిన ఆసుపత్రికి చేర్చగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. న్యాయవాదిగానే కాదు.. రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తారని.. స్థానికంగా మంచి పేరున్న నేతగా చెబుతున్నారు.

అంత పేరున్న నేతను పట్టపగలు.. అందరూ చూస్తుండగా హత్య చేసినా మహానగరంలో ఎవరూ అడ్డుకోవటం గమనార్హం. హత్యకు కారణం ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు.. బంధువర్గం ఆందోళన చేపట్టారు.