Begin typing your search above and press return to search.
బాలయ్యపై లాయర్లు కేసు పెట్టారు
By: Tupaki Desk | 7 March 2016 11:53 AM GMTఓ సినిమా ఆడియో ఫంక్షన్ వేడుకలో హిందూపురం ఎమ్మెల్యే - హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ హైదరాబాద్ పరుధిలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో న్యాయవాద జేఏసీ ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన సావిత్రి ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన ఎంతమాత్రమూ క్షమించరాని వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన న్యాయవాదులు, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లను పోలీసు అధికారులకు అందించారు. వీటిని పరిశీలించిన అనంతరం విచారణ జరిపి కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణస్తామని పోలీసులు తెలిపారు.
కాగా నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్ కు హాజరైన బాలయ్య అక్కడ ప్రసంగించారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రసారమయ్యాయి. దీనిపై ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో న్యాయవాదులు కేసు వేయడం చర్చనీయాంశమైంది.