Begin typing your search above and press return to search.
రేవంత్ చేతిలో ఆ మంత్రి రాజకీయ భవిష్యత్
By: Tupaki Desk | 9 Jan 2018 5:22 AM GMTతెలంగాణ వైద్యారోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి - కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతూనే ఉంది. మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతలపై ఇప్పటికే ప్రశ్నిస్తూ వస్తున్న రేవంత్ ఆయన చదివిన కాలేజీ వివరాలు - ఎన్నికల అఫిడవిట్ లో లక్ష్మారెడ్డి సమర్పించిన వివరాలు మీడియా ముందు పెట్టారు. మామూలుగా ఐదేళ్లలో మెడిసిన్ పూర్తవుతుందని చెప్తూ అటుఇటు అయినా ఆరేళ్లు పడుతుంది మరి లక్ష్మారెడ్డి ఎనిమిదేళ్లు మెడిసిన్ చేశారా? అని ఆయన ప్రశ్నించారు.1990లో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లక్ష్మారెడ్డి 1988లోనే ఎలా సర్టిఫికెట్ పొందారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తన చదువుకు సంబంధించి క్లారిటీ ఇచ్చాక కూడా కావాలనే రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు చేస్తున్నాడు అని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోపణలు చేసేవారు జర్నలిస్టులను పంపిస్తే గుల్బర్గా యూనివర్శిటీకి తీసుకెళ్లేందుకు సిద్ధమని ఆయన అన్నారు. `అక్కడికి వెళ్లేందుకు వాహనాలతో సహా అన్ని ఖర్చులు భరిస్తా. కావాలంటే నేను కూడా మీతో గుల్బర్గా యూనివర్శిటీకి వస్తా` అని చెప్పారు. `రేవంత్ రెడ్డి గారిని కూడా గుల్బర్గా వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నా. నా సర్టిఫికెట్ - కాలేజీ ఏ ఒక్కటి కరెక్ట్ కాకున్నా రాజకీయ సన్యాసం తీసుకుంటాను.` అని సవాల్ విసిరారు.
కాగా, తెలంగాణ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విద్యార్హతలపై ఆయన చదివిన కాలేజీ ప్రిన్సిపాల్ సంపత్ రావు ప్రెస్ మీట్ తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని రేవంత్ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టత ఇవ్వకముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అసలుకే మోసం వస్తుందని సంపత్ రావు అలా మాట్లాడి ఉంటారన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతలు ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వలేదన్న రేవంత్ లక్ష్మారెడ్డి నిజంగా డాక్టరైతే చదివిన కాలేజీకి ఉన్న అనుమతులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డిపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు.
అయితే రేవంత్ విలేకరుల సమావేశంలో నేపథ్యంలో మంత్రి లక్ష్మారెడ్డి పూర్తి స్పష్టత ఇవ్వడంతో పాటుగా...తనపై అవాకులు చెవాకులు పేలడం పక్కనపెట్టి నిజాలు నిరూపిస్తే..రాజకీయ సన్యాసం తీసుకుంనేందుకు సిద్ధమని మంత్రి సవాల్ చేసిన నేపథ్యంలో..ఇప్పుడు బాల్ రేవంత్ కోర్టులో ఉంది. ఇంకా చెప్పాలంటే... మంత్రి లక్ష్మారెడ్డి రాజకీయ భవిష్యత్ రేవంత్ చేతిలో ఉందన్నమాట.