Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ త‌ర‌ఫున రేవంత్ సీఎం...

By:  Tupaki Desk   |   11 Nov 2017 5:01 PM GMT
కాంగ్రెస్ త‌ర‌ఫున రేవంత్ సీఎం...
X
తెలంగాణ రాజ‌కీయాల్లో డైన‌మిక్ లీడ‌ర్‌ గా గుర్తింపు పొంది...త‌న‌కు ఆ చాన్స్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి బై బై చెప్పి...కాంగ్రెస్ గూటికి చేరిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జ‌ర్నీపై రాజకీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. రేవంత్ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌నకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప‌ద‌వీ బాధ్య‌త‌లు ఇవ్వ‌నుంది? సీనియ‌ర్ల శిబిరానికి కేరాఫ్ అడ్ర‌స్ అయిన కాంగ్రెస్‌లో....రేవంత్‌ కు అంద‌లం ద‌క్కుతుందా? ఆయ‌న‌కు ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ లేదా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కాక‌పోతే...పార్టీ కోఆర్డినేష‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారా? అనే చ‌ర్చోప‌చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

మ‌రోవైపు ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ‌స్తే...తామే సీఎం పీఠాన్ని అధిరోహిస్తామ‌ని ప‌లువురు సీనియ‌ర్లు సిద్ధంగా ఉన్నార‌ని ఇటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో చ‌ర్చ ఉంది మ‌రోవైపు రాజ‌కీయ వ‌ర్గాలు సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తుంటాయి. మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించే ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు సీఎం పీఠంపై తెగ మోజుతో ఉన్నార‌నేది రాజ‌కీయ‌వ‌ర్గాల భావ‌న‌. దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ సెటైర్లు కూడా వేస్తోంది. అధికారం రాని కాంగ్రెస్ పార్టీకి ఎంద‌రో ముఖ్యమంత్రులంటూ కామెంట్ చేస్తోంది. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ లో రేవంత్ స్థానాన్ని లైట్‌ గా తీసుకున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 30 మంది ముఖ్యమంత్రులు ఉండగా - కొత్తగా 31వ ముఖ్యమంత్రి పుట్టుకొచ్చాడని మంత్రి ల‌క్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నార‌ని...కానీ ఆయ‌న నంబ‌ర్ ఎక్కుడందో తెలుసుకోవాల‌ని మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీకి పథకాలు గుర్తుకొస్తాయని...రైతు సంక్షేమానికి పాటుపడేది టీఆర్ ఎస్ ఒక్కటేనని పేర్కొంటూ..కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌వ‌రేజీ క‌ల్ల అని వ్యాఖ్యానించారు.