Begin typing your search above and press return to search.

జగన్ తో జూనియర్ పోటీ...సీఎం సీటు ఎవరిదంటే....?

By:  Tupaki Desk   |   5 Feb 2023 8:00 AM GMT
జగన్ తో జూనియర్ పోటీ...సీఎం సీటు ఎవరిదంటే....?
X
ఏపీ సీఎం జగన్ మరోసారి సీఎం కావాలని చూస్తున్నారు. ఆయన ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వై నాట్ 175 అని కూడా పార్టీని ఉత్తేజపరుస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి అంతా అనుకూలంగా ఉందని జగన్ భావిస్తున్నారు. సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అని ఆయన ధీమాగా ఉన్నారు.

పార్టీకి చెందిన నాయకులు కూడా అదే మాట చెబుతున్నారు. మళ్లీ జగనే సీఎం. పూర్తి స్థాయిలో సీట్లు తమ పార్టీకే అని అంటున్నారు. అందరూ చెప్పడం ఒక ఎత్తు. దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ భార్య నందమూరి లక్ష్మీ పార్వతి చెప్పడం మరో ఎత్తు. ఆమె వైసీపీలో ఉన్నారు. కీకల నేతగా కూడా ఉన్నరు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఆమె వ్యవహరిస్తున్నారు.

ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇపుడున్న పరిస్తితుల్లో వార్ వన్ సైడెడ్ గా ఉందని, జగన్ని మరోసారి సీఎం గా చేయడానికి జనాలు డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. జగన్ కి ఏపీలో బలమైన ఆల్టర్నేషన్ లేదని, మరో ఆప్షన్ కూడా లేదని ఆమె అంటున్నారు. ఒక లోకేష్ పాదయాత్ర కూడా దండుగ అన్నట్లుగా ఆమె మాట్లాడారు. ఎంటీయార్ మనవడు, టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీయార్ ఈ పరిస్థితుల్లో టీడీపీకి కొమ్ము కాసి ప్రచారం చేసినా ఏమీ ఉపయోగం ఉండదని లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఇప్పటికే టూ లేట్ అయిందని, అందువల్ల జూనియర్ కూడా తెలుగుదేశాన్ని కాపాడలేడని ఆమె చెబుతున్నారు.

ఆయితే జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి జగన్ మాదిరిగా అయిదేళ్ల పాటు జనంలో ఉంటూ బాగా తిరిగితే మరో అయిదేళ్ల తరువత ఆయనకు అవకాశం ఏమైనా ఉండొచ్చేమో అని అంటున్నారు. అంటే జూనియర్ సీఎం కావాలీ అంటే తెలుగుదేశం పగ్గాలు ఇచ్చినా ఇన్ని చేయాలి అన్న మాట. లక్ష్మీపార్వతి ఆలోచనల్లో ఎటూ జూనియర్ కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వరు. ఇచ్చినా ఆయన సినిమాలు వదులుకుని అయిదేళ్ల పాటు జనంలో తిరగడం అన్నది కుదిరే వ్యవహారం కాదు అందువల్లనే ఆమె జూనియర్ సీఎం కావాలంటే ఇన్ని చేయాలి అంటున్నారు.

ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని కూటములు కట్టినా 2024లో జగన్ మరోసారి సీఎం కచ్చితంగా అవుతారు అని లక్ష్మీపార్వతి అంటున్నారు. ఈ విషయంలో డౌట్లు ఏమీ ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ తప్ప ఏపీకి మరో నాయకుడు లేడని లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఆమె ఎటూ తెలుగుదేశానికి యాంటీ కాబట్టి ఆమె విశ్లేషణ పట్టించుకోవాలా అన్నది కూడా ఆలోచించాలని అంటున్నారు.

మరో వైపు జూనియర్ ఎన్టీయార్ మీద ఉన్నట్లుండి లక్ష్మీ పార్వతి ఈ తరహా కామెంట్స్ చేశారు అంటే ఆయన కనుక తెలుగుదేశానికి ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా జూనియర్ ఫ్యాన్స్ ని కోరి రెచ్చగొట్టారా అన్న చర్చ కూడా ఉంది. అలా కనుక చేస్తే అది తెలుగుదేశానికే భారీ లాభాన్ని చేకూరుస్తుంది అన్నది లక్ష్మీపార్వతి మరచిపోయినట్టు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.