Begin typing your search above and press return to search.

గోవా గోల సద్దుమణగదా?

By:  Tupaki Desk   |   7 April 2015 10:07 AM GMT
గోవా గోల సద్దుమణగదా?
X
పర్యాటకులే ప్రధాన ఆదాయంగా ఉన్న గోవా రాష్ర్టంలోని ఫ్యాబ్ ఇండియా షోరూమ్్లోని ట్రయల్ రూమ్ లో కెమెరా ఉన్న విషయం కేంద్ర మంత్రి స్మతీ ఇరానీ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై రచ్చ ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఒకసారి ఈ విషయమై మాట్లాడిన గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మరోమారు స్పందిస్తూ గోవా పర్యాటకులకు ఎంతో సురక్షితమైన ప్రాంతమని చెప్పారు. ఫ్యాబ్ ఇండియాలాంటి సంఘటనలు ఎప్పుడోగానీ జరగవని చెప్పారు.

స్మృతి ఇరానీ ఫ్యాబ్ ఇండియా షోరూంలోని ట్రయల్ రూమ్ వద్ద నిఘా కెమెరాను గుర్తించిన విషయాన్ని ప్రస్తావిస్తూ..ఉద్దేశ పూర్వకంగా పెట్టిన కెమెరా కాదని అన్నారు. 'సీసీ టీవీ కెమెరాలు షోరూమ్ లోని ట్రయల్ రూం లోపల పెట్టలేదు. బయటి వైపే ఉంది. అంటే అది ఉద్దేశ పూర్వకంగా పెట్టినది కాదనే నా అభిప్రాయం' అని మీడియాకు చెప్పారు. ఫ్యాబ్ ఇండియా షోరూంలాంటి ఘటనలో పదివేలలో ఒక్కటి ఉండొచ్చని చెప్పారు. కేంద్రమంత్రి ఫిర్యాదు వల్ల తాము తీవ్రంగా స్పందించామనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. ఒక సాధారణ మహిళ ఫిర్యాదు చేసినా అంతే వేగంతో స్పందిస్తామని, చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.

మరోవైపు పర్యాటకులకు, మీడియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. పర్యాటకులు ఎవరూ ఇలాంటి వదంతులు నమ్మవద్దని గోవా సురక్షిత నగరం అని చెప్పారు. గోవా ప్రతిష్ఠను మసకబార్చేలా మీడియా ప్రయత్నం చేస్తుందని ఇక తానెప్పుడూ అనబోనని వివరించారు.