Begin typing your search above and press return to search.

హ‌రిబాబుకు షాకిస్తూ..బాబును క‌డిగేశారు

By:  Tupaki Desk   |   19 Feb 2018 5:29 AM GMT
హ‌రిబాబుకు షాకిస్తూ..బాబును క‌డిగేశారు
X
ఏపీతోనూ..ఆంధ్రోళ్ల‌కు ద్రోహం చేసినోళ్లు ఎవ‌రూ బాగుప‌డ‌లేద‌న్న‌ది చ‌రిత్ర చెబుతున్న వాస్త‌వం. ఇప్పుడు ఏపీ బీజేపీ ప‌రిస్థితి ఇంచుమించు ఇదేలా ఉంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పే పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌కొచ్చాయి. ఓప‌క్క ఏపీ అధికార‌ప‌క్షం.. విప‌క్షం త‌మ‌ను త‌లో రీతిలో బంతాట ఆడుకుంటున్న నేప‌థ్యంలో ఏపీ క‌మ‌ల‌నాథులు క‌స్సుమంటున్నారు. సొంత పార్టీ నేత‌ల్ని క‌డిగిపారేస్తున్నారు.

ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వ‌లేదంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర తీయ‌ట‌మే కాదు.. ఏపీని మోడీ మోసం చేశార‌న్న భావ‌న‌ను ఏపీ ప్ర‌జ‌ల్లోకి ఇంజెక్ట్ చేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కీల‌క‌భూమిక పోషించార‌ని.. మిత్ర‌ప‌క్షంగా ఉండి ఇలాంటి ప‌ని చేస్తారా? అంటూ ఆగ్ర‌హంతో ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీలో బీజేపీని విల‌న్ చేసిన చంద్ర‌బాబుకు అమీతుమీ తేల్చుకోవాల‌ని.. అవ‌స‌ర‌మైతే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని ఏపీ బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఏపీ బీజేపీ అంత‌ర్గ‌త స‌మావేశంలో తొలిసారి నాయ‌క‌త్వాన్ని ధిక్క‌రించేలా మాట్లాడేయ‌ట‌మే కాదు.. ఏపీ బీజేపీ బాధ్యుడు హ‌రిబాబును క‌డిగేసిన వైనం ఇప్పుడా పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం బెజ‌వాడ‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కొంద‌రు జిల్లా నేత‌లు హ‌రిబాబుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్ర బ‌డ్జెట్ ను బాబు ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత‌.. ఏ జిల్లాకు అయితే త‌క్కువ‌గా నిధులు కేటాయిస్తారో ఆ జిల్లా నుంచి ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌న్న చిత్ర‌మైన డిమాండ్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి త‌క్కువ కేటాయించిన దానిపై ఏపీ నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. రాష్ట్ర బ‌డ్జెట్ లో ఏ జిల్లాకు త‌క్కువ నిధుల్ని ఏపీ స‌ర్కారు కేటాయిస్తుందో దానిపై పోరు మొద‌లెట్టాలంటూ తొండి వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ చూసిన త‌ర్వాత ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొట్టాల్సిందేన‌న్న మాట‌కు హ‌రిబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది.

దీంతో.. తీవ్ర‌స్థాయిలో కొంద‌రు నేత‌లు హ‌రిబాబుపై విరుచుకుప‌డ‌టంతో ఆయ‌న షాక్ తిన్న‌ట్లు చెబుతున్నారు. టీడీపీపై ఎదురుదాడికి దిగాల్సిందేన‌ని హ‌రిబాబుపై కేక‌లు వేయ‌టంతో హ‌రిబాబు అండ్ కో బిత్త‌ర‌పోయారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన హ‌రిబాబు.. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ అంశాన్ని తెర మీద‌కు తెచ్చారు. దీనిపై రియాక్ట్ అయిన కృష్ణా జిల్లా పార్టీ నాయ‌కుడు ల‌క్ష్మీప‌తి రాజా.. విజ‌య‌న‌గ‌రం జిల్లా నేత స‌న్యాసి రాజులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ.. పార్టీ విధానాలేంటో త‌మ‌కు తెలుస‌న్నారు. రాష్ట్రంలో పార్టీని ఎద‌గ‌కుండా కొంద‌రు కుట్ర చేస్తున్న‌ట్లు ఆరోపించారు. హ‌రిబాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డిన ల‌క్ష్మీప‌తి రాజా.. నాలుగేళ్లుగా నిద్ర‌పోతున్నారా? బాబును అప్పుడే కంట్రోల్ చేయాల్సింది.. కేంద్ర బ‌డ్జెట్ త‌ర్వాత ప్ర‌జ‌ల్లో బీజేపీని విల‌న్‌ ను చేశారంటూ మండిప‌డ్డారు. తాను చేయాల్సింది చేస్తాన‌ని.. నీకు చేత‌నైతే చేయాల్సింది చేసుకో అంటూ హ‌రిబాబుకు స‌వాల్ విసిరిన ఆయ‌న‌.. కావాలంటే స‌స్పెండ్ చేసుకో అంటూ విరుచుకుప‌డిన‌ట్లు స‌మాచారం. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో ఏపీ బీజేపీ నాయ‌క‌త్వం ఒక్క‌సారి షాక్ కు గురైన‌ట్లు చెబుతున్నారు. ఏపీకి హ్యాండ్ ఇచ్చిన బీజేపీలో మొద‌లైన ముస‌లం ఎంత‌వ‌ర‌కు వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.