Begin typing your search above and press return to search.
ఎల్ బీ నగర్ మెట్రో ప్రారంభానికి కేసీఆర్ దూరం
By: Tupaki Desk | 20 Sep 2018 6:07 AM GMTకొన్నిసార్లు అంతే.. అనుకున్నవి అనుకున్నట్లుగా అస్సలు జరగవు. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలిగిపోయేలా చేసే మెట్రో రైలుకు సంబంధించిన మియాపూర్ - ఎల్ బీనగర్ రూట్ ను రానున్న సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.
దాదాపు కోటిన్నర వరకూ ఉన్న నగర జనాభాకు ఈ రూట్ లో మెట్రో పరుగులు తీయటంతో నగర జీవి జీవితం మరింత సుఖమయం కావటమే కాదు.. మరింత వేగాన్ని సంతరించుకునే వీలుంది. ఈ రూట్లో అందుబాటులోకి రానున్న మెట్రోతో కోట్లాది పని గంటలు ఆదా కానున్నాయి. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ ప్రాజెక్టును తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ చేతుల మీదగా కాకుండా.. గవర్నర్ నరసింహన్ స్టార్ట్ చేయటం ఆసక్తికరంగా మారింది.
తొలుత అనుకున్న దాని ప్రకారం ఈ ప్రధాన రూట్ ను కేసీఆర్ చేతలు మీదుగా ప్రారంభించాలని భావించారు. అయితే.. అంతలోనే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. తాజా పరిణామంతో మెట్రోను అపద్దర్మ ముఖ్యమంత్రి హోదాలోకేసీఆర్ స్టార్ట్ చేస్తారా? అన్న సందేహం వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే.. కేసీఆర్ మెట్రో ప్రారంభానికి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ముందస్తు మోజేమో కానీ కీలక ప్రాజెక్టుకు ఆయన లేకుండానే స్టార్ట్ అయ్యేలా చేసిందని చెప్పక తప్పదు.