Begin typing your search above and press return to search.
ఫ్రాన్స్ కూడా విదేశీ ఉద్యోగాలకు నో!
By: Tupaki Desk | 19 April 2017 9:03 AM GMTస్థానికులకే ఉద్యోగాలు అనే నినాదాన్ని నెత్తికి ఎత్తుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానంలో నడించేందుకు మిగతా దేశాలు క్యూ కడుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం తర్వాత సింగపూర్ - ఆస్ర్టేలియా అలాంటి ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ఫ్రాన్స్ చేరే అవకాశం ఉంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దీర్ఘకాలిక వీసాల జారీపై నిషేధం విధిస్తానని మితవాద అభ్యర్థి మారినే లీ పెన్ హామీ ఇచ్చారు. విదేశీ కార్మికులు - ఉద్యోగులను కిరాయికి తీసుకునే కంపెనీలపై పన్ను విధిస్తామని చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్ ఓటింగ్ వచ్చే ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆమె ప్రముఖ రేడియోతో మాట్లాడారు. ఫ్రాన్స్ పౌరుల నుండి ఉద్యోగాలను లాగేసుకోవడం లేదని ప్రభుత్వం నిర్ధారించుకోవడానికి వీలుగా దీర్ఘకాలిక వీసాల జారీ నిలుపు చేస్తూ తక్షణమే ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. లీపెన్ తన ప్రచారంలో ప్రధానంగా ఇమ్మిగ్రేషన్, యూరప్ సరిహద్దులు తెరవడంపై దృష్టి కేంద్రీకరించారు. విదేశీయులకు లేబర్ కాంట్రాక్టులు ఇచ్చే కంపెనీలపై 10శాతం పన్ను విధించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం లీ పెన్‌తో సహా నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఆధిక్యతలో వుండే ఇద్దరూ మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీ పడతారు. అయితే దేశీయంగా కీలకమైన ఉద్యోగాల విషయాన్ని లీ పెన్ ప్రస్తావించిన నేపథ్యంలో మిగతా నాయకులు, ఎన్నికల బరిలో నిలిచేవారు సైతం ఇదే డిమాండ్ వినిపిస్తారని తెలుస్తోంది. తద్వారా వలస ఉద్యోగుల విషయంలో వేటు ఖాయమని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/