Begin typing your search above and press return to search.
ఎక్కడా సెట్ కాని లీడర్లు !
By: Tupaki Desk | 16 Jan 2021 8:00 AM ISTఏ పంట వేసుకునేందుకూ అనుకూలంగా లేని భూమిని రేవడి.. అంటారు. ఇదే రెంటికీ చెడ్డ రేవడిగా.. రానురాను పడికట్టు పదం అయింది. ఈ మాటే ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న డిబేట్‌లో జోరుగా వినిపిస్తోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతల పరిస్థితిపై తాజాగా జరుగుతున్న విశ్లేషణల్లో చివరాఖరుకు వచ్చిన కంక్లూజన్ ఇదే! ``ఈ నేతలు రేవడులు రా భయ్!`` అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు? అసలు వారెవరు? అనే చర్చను చూద్దాం. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి.. మరో పార్టీలోకి జంప్ చేసిన వారు.. గత ఎన్నికల్లో ఎటూ కాకుండా పోయారు.
అయినా.. ఏపీలో మాత్రం రాజకీయాలు మారలేదు. నేతల ఆలోచనలు కూడా మారలేదు. దీంతో ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి మద్దతిస్తున్నారు. ఇలాంటి వారిలో రాపాక వరప్రసాద్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి ప్రస్తుతం లైవ్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు. ఇక, మాజీలను గమనిస్తే.. తోట త్రిమూర్తులు, శిద్దా రాఘవరావు, ఆకుల సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్, యామినీ బాల, శమంతకమణి.. ఇలా చెప్పుకొంటూ పోతే.. చాతాండంత జాబితా రాజకీయ తెరపై తారట్లాడుతోంది. వీరిలో అందరూ కూడా వ్యక్తిగత ఇమేజ్‌తో నెట్టుకొచ్చిన పరిస్థితి లేదు. పార్టీల దన్నుతోనే గెలుపు గుర్రాలు ఎక్కారు.
కానీ, ఇప్పుడు అలా గెలిచిన, లేదా.. ఓడిన పార్టీలను పక్కన పెట్టి.. అధికార పార్టీకి భజన చేస్తున్నారు. మరికొందరు పార్టీలకు ఏకంగా దూరమై.. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. అయితే.. ఈ పరిణామం.. సదరు నేతలకు ఎన్నాళ్లు పనిచేస్తుంది? వారి వ్యక్తిగత ఇమేజ్ ఏమవుతుంది? అనే ప్రశ్నలు వస్తే.. వ్యక్తిగత ఇమేజ్ జీరో అవుతుందని, ఇది కొన్నాళ్లకు మించి పనిచే చాన్స్ లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన ఉదాహరణ.. ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక వంటి వారి పరిస్థితేనని చెబుతున్నారు పరిశీలకులు. వైసీపీ తరఫున గెలిచి.. టీడీపీలోకి జంప్ చేసి ఏదో సాధించేద్దాం అనుకున్నారు.
కానీ, ఏమీ సాధించలేక పోయారు. కనీసం 2019 ఎన్నికల్లో టికెట్‌ను కూడా పొందలేక పోయరు. ఇటు ఈ పార్టీ ఇవ్వలేదు.. అటు ఆ పార్టీ ఇవ్వలేదు. దీంతో నలిగిపోయారు. పోనీ.. స్వతంత్రంగా బరిలో దిగే దమ్ముందా? అంటే.. లేనేలేదు. అంతేకాదు.. అప్పటి వరకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌ను కూడా కోల్పోయారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే.. అవకాశం కోసం దిక్కులు చూస్తున్నారు. ఇవి ఉదాహరణలు.. కానీ.. ఇప్పుడు కూడా ఇలానే చాలా మంది నాయకులు(పైన చెప్పుకొన్నవారు) చేస్తున్న ఫీట్లు గమనిస్తే.. `రెంటికీ చెడబోయే రేవడులు` అనకుండా ఉండలేక పోతున్నారట నెటిజన్లు!!