Begin typing your search above and press return to search.

అమ్మవారి పై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!!

By:  Tupaki Desk   |   31 Dec 2021 8:38 AM GMT
అమ్మవారి పై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!!
X
మన దేశం సాంకేతికంగా ఎంతో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా భూమి నుంచి ఆకాశం వరకు మానవుడు సాధించిన ఎన్నో విజయాలు సాధించాడు. అవి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సాంకేతికంగా ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న కానీ మన దేశంలో చాలా మంది ఇంకా మూఢ నమ్మకాల ఊబి లోనే ఇంకా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. టెక్నాలజీ రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే వారు మాత్రం ఇంకా అక్కడే ఉండి పోయారు. ఇప్పటికే ఎంతో మంది బాబాలు వారు చేసిన ఘనకార్యాలను సామాజిక మాధ్యమాలు, వివిధ టీవీ ఛానల్ లో కళ్లకు కట్టినట్టు చూపించాయి. అయినా కూడా ఇంకా చాలా మంది దేవుని పేరుతో చలామణి అవుతున్నారు. మరి కొందరైతే మతం పేరును చెప్పుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రతి మతంలోనూ ఇలాంటి వ్యక్తులు కొందరు ఉంటారు. వారితో మొత్తం మాట పడాల్సి వస్తోంది.

ఒక పాస్టర్ తన దగ్గరకు వచ్చిన మహిళలను వేరే విధంగా వశపరచుకుని వారితో లైంగికంగా ఉన్న వార్తలను మనం ఎన్నో చూశాం. అలానే మత గురువుల పేరుతో మరి కొంత మంది హిందూ మతంలో కూడా ఇలానే చలామణి అవుతున్నారు. డేరా బాబా లాంటి వాళ్ళు వారు చేసిన దానికి శిక్ష కూడా అనుభవించారు. అయితే అమ్మవారి పేరుతో ప్రజలను మోసం చేసే ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే అందరిలా కాకుండా ఆమెది మరొక తీరు. ఆమె గత చరిత్ర చూస్తే చాలా మంది ముక్కున వేలు వేసుకుంటారు. ఆమె పేరు అన్నపూర్ణ అరసు. ఈమె ఈ పేరుతో అమ్మవారి గా ప్రజలను మోసం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా అన్నపూర్ణ కు సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ నటి ఒకరు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆమె ప్రముఖ బుల్లితెర నటి కస్తూరి శంకర్. కస్తూరి గృహ లక్ష్మి సీరియల్ తో చాలా పాపులర్ అయ్యారు. ఈమె కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. అయితే తాజాగా అన్నపూర్ణ కు సంబంధించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇందుకు ప్రధాన కారణం అందులో అమ్మవారిగా అన్నపూర్ణ ఉంది వింతగా కనిపించడమే.

అయితే కస్తూరి శంకర్ ఆ వీడియో పోస్ట్ చేస్తూ కింద ఇక దొంగ స్వామీజీలు, అమ్మవార్ల నుంచి ఆ దేవుడు తనని తానే రక్షించుకోవాలని పెట్టింది. ప్రజలు కూడా ఇలాంటి వారిని నమ్మొద్దని ఆమె అందులో కోరింది. కస్తూరి శంకర్ ఇలాంటి పోస్ట్లు చేయడం ఏమి ఇది తొలిసారి కాదు. ఇలాంటి పోస్టులను గతంలో కూడా ఆమె చేశారు. స్వతహాగా కస్తూరి శంకర్ లాయర్. సమాజంలో మార్పు కోసం ఎప్పుడూ తన వంతుగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ట్వీట్ ను కూడా చేసినట్లు తెలిపారు.


ఇక ఈ వీడియోలో దేవత గా ఉన్న అన్నపూర్ణ విషయానికి వస్తే ఆమెది తమిళనాడు. మధ్య తరగతి కుటుంబం. ఆమెకు పెళ్ళి అయిన తరువాత కొన్ని రోజులు కాపురం చేసింది. అనంతరం పిల్లలు కూడా కలిగారు. అయితే ఆమె ఓ వ్యక్తిని ఇష్ట పడింది. అనంతరం ఇందుకు సంబంధించి గొడవలు కూడా కుటుంబంలో జరిగాయి. అయితే వీరు బతుకు జట్కా బండి ఇలాంటి షో లకు కూడా వచ్చారు. ఆ సమయంలోనే అన్నపూర్ణ బాగా ఫేమస్ అయింది. ప్రియుడి ఆలోచనల్లో పడి భర్తను కూతుర్ని కూడా దూరం చేసుకుంది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త అనుమానాస్పదం లో చనిపోయారు. అన్నపూర్ణ అయితే ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు ఈ క్రమంలోనే ఆమెను చూసిన భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు దీనిని ఓ వ్యక్తి వీడియో తీశాడు ఆ వీడియో లే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ వీడియో నే కస్తూరి శంకర్ షేర్ చేశారు.