Begin typing your search above and press return to search.

లెంపలేసుకున్న అగ్రపత్రిక

By:  Tupaki Desk   |   2 Nov 2017 7:00 AM GMT
లెంపలేసుకున్న అగ్రపత్రిక
X
మామూలుగా ఒక చిన్న తప్పు దొర్లితేనే దానికి సంబంధించి నానా రాద్ధాంతం అవుతుంటుంది. లీగల్ కేసులు - పరువు నష్టం దావాలు ఇలా అనేక వ్యవహారాలు నడుస్తాయి. వ్యక్తుల ఇమేజ్ కు నష్టం జరిగితేనే ఇంత గందరగోళం అవుతున్నప్పుడు... ఏకంగా ప్రభుత్వాల పరువు పోయేలాగా తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఎలా? అలాంటి పోరాబాట్లను దిద్దుకోకపోతే అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. అందుకే ఇప్పుడు ఒక అగ్రపత్రిక లెంపలు వేసుకుని, సవరణ ప్రచురించింది. తాము వేసిన పొరబాటు వార్త ఏకంగా ఏపీ సర్కారు పరువు తీసేది కావడంతో మరింత జాగ్రత్తగా దీనిని ప్రచురించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ ను మళ్ళీ సాధించిందని కీర్తిస్తూ అగ్రపత్రిక బుధవారం ఒక కథనం ఇచ్చింది. తెలంగాణను పొగడ్డం మాత్రమే కాదు... ఏపీ కి 15 వ రాంక్ వచ్చిందని కూడా వేసేసారు. నిజానికి ఈ కథనాన్ని మోడీని కీర్తించడానికి వాడుకున్నారు. దేశాన్ని 130వ రాంక్ నుంచి 100 లోకి తెచ్చారంటూ కొనియాడారు. అయితే ప్రచురణ తర్వాత నాలుక కరచుకునేలా వారు గుర్తించిన పొరబాటు ఏంటంటే అసలు వీరు ఇంటర్నెట్ నుంచి తీసుకున్నవన్నీ తప్పుడు వివరాలు.

పాత గణాంకాలతో కొత్త స్టోరీ అల్లేసారు. ఈ ఏడాది రాంక్ లు డిసెంబర్ చివరికి గాని వెల్లడయ్యే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ భేటీ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కథనాల వల్ల ఏపీ కి చాలా నష్టం జరుగుతుందని అన్నారు. తమ తప్పు గుర్తించిన అగ్రపత్రిక కూడా లెంపలు వేసుకుంది. పెద్ద సవరణను కూడా ప్రచురించింది.మొత్తానికి చంద్రబాబు జోక్యంతో అగ్రపత్రిక దిద్దుకున్నది