Begin typing your search above and press return to search.
చైనాను రౌండప్ చేసేస్తామంటోన్న హిల్లరీ!!
By: Tupaki Desk | 15 Oct 2016 1:35 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రచార చైర్మన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను హ్యాక్ చేసిన వికీలీక్స్ తాజాగా ఆ వివరాలను వెల్లడించింది. ఈ వివరాల్లో అగ్రరాజ్యం భవిష్యత్ ప్రణాళికలు - చైనా - ఉత్తర కొరియాల విషయంలో ఆచరించబోయే వ్యవహారాలు.. ఇలా అత్యంత రహస్యమైన విషయాలు ఉన్నాయి. ఈ మెయిల్స్ లో హిల్లరీ ప్రైవేటు సంభాషణలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలతో పాటు పలు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయట. ఈ మెయిల్స్ ద్వారా వెల్లడైన విషయాల్లో అత్యంత ముఖ్యమైంది ఉత్తరకొరియా యవ్వారాలు - ఆ పనులకు మద్దతు పలుకుతున్న చైనా కు చెక్ పెట్టడం. ఇవి అంతర్జాతీయంగా అమెరికాకు అత్యంత ముఖ్యమైన, రహస్యమైన విషయాలనే చెప్పాలి.
ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలను ఆపకపోయినా, వాటిని చైనా నిలువరించకపోయినా ఆ దేశాన్ని తమ క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టేస్తామని హిల్లరీ క్లింటన్ ఓ ప్రైవేటు సంభాషణలో పేర్కొన్నారని తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో హిల్లరీయే అమెరికా అధ్యక్షురాలైతే చైనాపై ఏ విధమైన వైఖరి అవలంబించనున్నారో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి! ఇదే సమయంలో మరో సీక్రెట్ విషయం కూడా బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా హిల్లారీ "చైనా... నువ్వు వారిని(ఉత్తరకొరియాను) నియంత్రించు, లేదా మేం వారికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు కూడా.
అయితే ఉత్తర కొరియా ఈ ఏడాది ఐదోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించాలని అమెరికా - దక్షిణ కోరియా భావిస్తుండగా, చైనా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ విషయాలపై అమెరికా సీరియస్ గా ఉన్నదని హిల్లరీ చెప్పారు. ఉత్తర కొరియా విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షిస్తే, అది పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా మారుతుంది. అలాగే అమెరికా పశ్చిమ తీరమైన హావాయ్ ను ఆ క్షిపణులు సులువుగా ఢీకొట్టగలవు అని చెబుతున్న క్లింటన్... "మేం చైనాను క్షిపణి రక్షణ వ్యవస్థను చుట్టుముట్టబోతున్నాం.. ఆ ప్రాంతంలో మరింత నౌకాదళాన్ని మోహరించబోతున్నాం" అని పేర్కొన్నారు.
కాగా, వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతూ, అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటూ అలజడి సృష్టిస్తోన్న ఉత్తరకొరియాకు ఏకైక సపోర్ట్ గా చైనా నిలబడుతోంది. ఉత్తరకొరియాకు సన్నిహిత దౌత్య, మిత్ర దేశంగా చైనా అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను చైనా నిలువరించడం లేదంటూ ఆ దేశంపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/