Begin typing your search above and press return to search.
రమ్య `నకిలీ` ట్రైనింగ్...వైరల్ వీడియో!
By: Tupaki Desk | 7 Feb 2018 11:28 AM GMTబెంగుళూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .....మత్తులో ప్రసంగించారని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ , నటి రమ్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై రమ్య ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రమ్యపై బీజేపీ మండిపడింది. ఆ వివాదం సద్దుమణగక ముందే రమ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ లను గురించి ఆమె ప్రసంగిస్తున్న వీడియో ఒకటి లీక్ కావడంతో ఆమెపై బీజేపీ విరుచుకుపడింది. నకిలీ ఖాతాలను ఎలా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని స్పీచ్ ఇస్తున్న రమ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, రమ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రమ్య ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో 3 అకౌంట్లు ఓపెన్ చెయ్యాలని, వాటిని ఎలా ఉపయోగించాలో తాను చెబుతానని, తనకు కూడా రెండు మూడు అకౌంట్లు ఉన్నాయని రమ్య చెబుతున్న ఓ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే, దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాధ్యతగల హోదాలో ఉన్న రమ్య ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్లుగా స్విస్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు ఉన్న కాంగ్రెస్ కు చెందిన రమ్యకు నకిలీ అకౌంట్స్ గురించి బాగా తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. రమ్య ప్లాన్ వల్లే రాహుల్ గాంధీ ట్విట్ లకు లైక్ లు వస్తున్నాయని, ఆ విషయం స్వయంగా ఆమె వెల్లడించిందని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో సోషల్ మీడియాలో వెర్బల్ వార్ ఖాయమని అభిప్రాయపడుతున్నారు. రమ్యను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ప్రారంభించాలని మాత్రమే రమ్య చెప్పారని, నకిలీ ఖాతాలు ప్రారంభించాలని చెప్పలేదని కొందరు సమర్థిస్తున్నారు. ఏదేమైనా, ఈ వీడియోతో రమ్య ఇమేజ్ కొద్దిగా డ్యామేజ్ అయిందని చెప్పవచ్చు.