Begin typing your search above and press return to search.

మన ‘అదృష్టం’ మనమ్మాయిని ఓడించింది

By:  Tupaki Desk   |   4 Jun 2016 10:07 AM IST
మన ‘అదృష్టం’ మనమ్మాయిని ఓడించింది
X
మనోళ్లు ఓడిపోయినా సంతోషంగా ఉంటుందా? అంటే ఉండదని చెబుతారు. కానీ.. ఈ ఉదంతం తెలిస్తే మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతారు. మనమ్మాయి ఓడిపోయినా పెద్దగా బాధ పడని విచిత్రం ఇది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మనమ్మాయి కాకున్నా మన అదృష్టంగా ఫీలయ్యే ఆమె కారణంగానే మనమ్మాయి ఓడిన ముచ్చట ఇది. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో కాస్త చిత్రమైన అనుభూతిని మిగిల్చింది.

సానటీనాగా ముద్దుగా పిలుచుకునే స్విస్ టెన్నిస్ దిగ్గజం మార్టినా హింగిస్.. సానియా మీర్జాలు జంటగా కలిసి ఎన్ని టోర్నీల్లో విజయం సాధించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వీరిద్దరూ తాజాగా ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. మన హైదరాబాదీ సానియా మీర్జా క్రోయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్ తో జత కట్టి కోర్టులోకి దిగితే.. మన అదృష్టంగా భావించే హింగిస్ మన లియాండర్ పేస్ తో జత కట్టి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు పోటీ పడ్డారు.

ఈ ఇద్దరి మధ్య పోటాపోటీగా సాగిన పోటీలో మనమ్మాయి ఓడిపోతే.. మన అదృష్టం గెలిచింది. ఫ్రెంచ్ మిక్స్ డ్ డబుల్స్ ను మన అమ్మాయి సానియా ఓడినా.. మన అబ్బాయి పేస్ విజయం సాధించటం ఆనందాన్ని కలిగిస్తుంది. మన అదృష్టంగా భావించే హిగింస్ చేతిలో మనమ్మాయి ఓడిపోయినా పెద్ద బాధ అనిపించకపోవటం ఈ ఫైనల్ మ్యాచ్ గొప్పతనంగా చెప్పాలి. తాజా విజయంతో 42 ఏళ్ల లియాండర్ పేస్ కు ఇది 18వ గ్రాండ్ స్లామ్ టైటిల్.