Begin typing your search above and press return to search.

బీహార్ టీచర్ల లీవ్ లెటర్లు..వైరల్

By:  Tupaki Desk   |   3 Dec 2022 6:44 AM GMT
బీహార్ టీచర్ల లీవ్ లెటర్లు..వైరల్
X
స్కూల్ కు రెడీ అయి ఉదయం టిఫిన్ తినగానే సడెన్ గా కడుపు నొప్పి వచ్చింది...అందుకే స్కూల్ కి రాలేదు...నిన్న రాత్రి ఉన్నట్లుండి 101 జ్వరం వచ్చింది...బ్లడ్ టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ అన్నారు...కాబట్టి వారం పాటు స్కూల్ కు రాలేను...ఉదయం స్కూల్ కు వచ్చాను..మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వెళ్లినప్పటి నుండి మోషన్స్ అవుతున్నాయి...అందుకే రెండు రోజులు స్కూల్ కు రాలేకపోయాను...ఈ కారణాలన్నీ బడి ఎగ్గొట్టేందుకు చిన్న పిల్లలు చెప్పే కుంటి సాకులు అని ఇట్టే అర్థమవుతుంది.

'ఈ నెల 5న రాత్రి 8 గంటలకు మా అమ్మ చనిపోతారు. కాబట్టి అంత్యక్రియల కోసం 6, 7వ తేదీల్లో సెలవులు కావాలి'..'త్వరలోనే నా ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి 4, 5 తేదీల్లో సెలవు ఇప్పించండి'..'నేను ఓ పెళ్లికి వెళ్లాలి. అక్కడ బాగా తినేస్తాను కాబట్టి కడుపు నొప్పి వస్తుంది.

కాబట్టి ఏడో తేదీన నాకు సెలవు ఇవ్వండి' ఈ రకమైన ఫ్యూచరిస్టిక్ కుంటి సాకులతో కూడా స్కూల్ కు ముందస్తు సెలవులు అడుగుతున్నారంటే ఈ స్టూడెంట్స్ బాగా అప్డేట్ అయ్యుండాలి..లేదా తెలివి తక్కువ దద్దమ్మలైనా అయ్యుండాలి అనుకుంటే మీరు తప్పులో..పప్పులో ఒకేసారి కాలేసినట్లే.

ఈ లీవ్ లెటర్లు రాసింది విద్యార్థులు కాదు....ఇలా పిచ్చి కారణాలతో సెలవులు అడగకూడదు అని నేర్పాల్సిన ఉపాధ్యాయులు. బిహార్ లో ఈ వింత లీవ్‌ లెటర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ టైప్ టీచర్లు కూడా ఉన్నారా అని అంతా షాకవుతున్నారు.

ఎప్పుడు పడితే అప్పుడు సెలవు పెడితే కుదరదు... సెలవు పెట్టడానికి ముందే దరఖాస్తు చేసుకోవాలని భాగల్‌పూర్ కమిషనర్ దయానిధన్ పాండే ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో, అక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు..ఇలా ముందస్తు సెలవుల కోసం తమ ఫ్యాంటసీ ఆలోచనలకు పదునుపెడుతున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఈ లీవ్ లెటర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.