Begin typing your search above and press return to search.

అద్దె డైలాగులు వ‌దిలేయండి ష‌ర్మిల !

By:  Tupaki Desk   |   3 May 2022 7:30 AM GMT
అద్దె డైలాగులు వ‌దిలేయండి ష‌ర్మిల !
X
కేసీఆర్ గురించి ఏమ‌యినా మాట్లాడండి.. ఏం కాదు అదేవిధంగా కేటీఆర్ గురించి కూడా ఏమ‌యినా మాట్లాడండి.. ఏం కాదు ఎందుకంటే అవ‌న్నీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా సాగే ప‌న్నాగాలు లేదా ద్వేష సంబంధ రాజ‌కీయాలకు కార‌ణాలు.దృక్ప‌థ సంబంధం అయిన మాట‌లు కూడా కావొచ్చు. ఒక‌నాటి క‌న్నా రాజ‌కీయం ఇప్పుడు మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్న పార్టీల‌కు చాలా డైలాగులు కావాలి. స్పీచుల్లో నాచు ప‌దార్థం లాంటి మాట‌లు ఎవరికి కావాలి.. నాటు ప‌దాలే కావాలి. అందుకే నాయ‌కులు ఎక్కువ‌గా నాటు ప‌దాలే వాడుతున్నారు. మాసివ్ అట్రాక్ష‌న్-ను పెంచే కార‌ణం కూడా ఇదే కావాలి.

గ‌తంలో ఓ సంద‌ర్భంలో అసెంబ్లీలో వైఎస్సార్ నోరు జారి త‌రువాత ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. విప‌క్ష నేత చంద్ర‌బాబు ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్య‌లు చేసి త‌రువాత దిద్దుకోవ‌డం త‌న త‌రం కాక చేతులెత్తేశారు. ఆఖ‌రికి ఆయ‌నే దిగివచ్చి స‌భాముఖంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు బాబుకు ! అటుపై కేసీఆర్ కూడా కొంత కాదు పూర్తి స్థాయిలో ఇది తెలంగాణ భాష అంటూ కొన్ని నాటు ప‌దాలు (రాయ‌డానికి వీల్లేని ప‌దాలు) కూడా చేర్చి మాట్లాడి ఇమేజ్ పెంచుకున్నారు. తెలంగాణ భాష‌కు, యాస‌కు తానొక బ్రాండ్ అంబాసిడ‌ర్ ( ప్ర‌చార క‌ర్త కాదు లేండి ప్ర‌చారానికి సంబంధించి వ్యూహ క‌ర్త అని రాయాలి) అని ప్ర‌మోట్ చేసుకున్నారు.

ఇక ఆంధ్రా నాయ‌కుల విష‌యానికే వ‌స్తే జ‌గ‌న్ కూడా చాలా నాటు ప‌దాలే వాడారు. అవ‌న్నీ పాద‌యాత్ర స‌మ‌యంలో ! త‌రువాత ఆయన మాట్లాడ‌డం మానుకున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో (సీఎం అయ్యాక‌) మునుప‌టి వేగం లేదు. కాన్ఫిడెన్స్ లేదు. ఆయ‌న బ‌దులు ఇంకొంద‌రు మాట్లాడి నాటు ప‌దాలు వాడేరు. ఆవిధంగా కొడాలి నాని మ‌రియు పేర్ని నాని బాగానే పేరుతెచ్చుకున్నారు. ఇక రోజా కూడా ఇలాంటి నాటు భాషే వాడారు .ఇందులో పైన పేర్కొన్న నేత‌లంతా అద్దె డైలాగులే చెప్పారు. రాసిచ్చిన స్క్రిప్టులు కొన్ని చ‌దివేరు.

ఆ మాట‌కు వ‌స్తే ప‌వ‌న్ కూడా నాటు ప‌దాలే వాడేరు. అద్దె డైలాగులు కొన్ని త్రివిక్ర‌మ్ రాయ‌గా ప‌లికారు అని ఇప్ప‌టికీ కొంద‌రు విప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ చేసినా, ప‌వ‌న్ భాష పీఆర్సీ లో ఉన్నా నాటి క‌న్నా మెరుగయింది కానీ విప‌క్షాల విష ప్రచారం మాత్రం అలానే ఉంది. ఇక అద్దె డైలాగుల‌ను ప‌లుకుతున్న మ‌రో నేత గురించి చెప్పాలి. ఆమె వైస్సార్టీపీ అధినేత్రి ష‌ర్మిల. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ (భార‌తీయ రాష్ట్ర స‌మితి)పేరుతో త్వ‌ర‌లో కేసీఆర్ పూనిక వ‌హిస్తూ ఆరంభించ‌నున్న జాతీయ పార్టీపై అప్పుడే సెటైర్లు వేశారు.

అవి కూడా సోష‌ల్ మీడియా అనుకుంటున్నారంటే బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇది కూడా అద్దె డైలాగే ! సొంత డైలాగ్ మాత్రం కాదు. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఉ ద్దేశించి రోజా కూడా ఓ అద్దె డైలాగు ప‌లికారు అని ఇటీవ‌ల ఓ రాజ‌కీయ విశ్లేష‌కులు, గ‌తంలో ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌కు చెందిన జ‌ర్న‌లిజం స్కూలులో పాఠాలు బోధించే అధ్యాప‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యాఖ్యానించారు. ఆ రోజు కేసీఆర్ ను ఉద్దేశించి రోజా ఏమ‌న్నారంటే రాత్రి బారు ప‌గ‌లు ద‌ర్బారు అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇవి కూడా అద్దె డైలాగులే అని ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అయిన పాశం యాద‌గిరి ప‌లుకుల‌నే ఆమె రిపీట్ చేశార‌ని చెప్పారు ఆ రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆ విధంగా రోజా కూడా అద్దె ప‌లుకులే ప‌లికారు. అంటే వీళ్లంతా సొంత మాట‌లు ఏనాడూ చెప్ప‌రా? ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌జలే నా దేవుళ్లు స‌మాజ‌మే నా దేవాల‌యం అన్న మాట కూడా ఎన్టీఆర్-ది కాక‌పోవ‌చ్చు. అది కూడా అద్దె డైలాగే కావొచ్చు. ఎందుకంటే ఇప్ప‌టి పొలిటీషియ‌న్ల కన్నా అప్ప‌ట్లో అన్న‌గారు ఎంతో బెట‌ర్. ఆయ‌న కొందరు క‌వుల‌నూ, ర‌చ‌యిత‌ల‌నూ వీలున్నంత ఆద‌రించారు. ఆ విధంగా సినారే, త్రిపుర‌నేని మ‌హార‌థి, మాడుగుల నాగ‌ఫణిశ‌ర్మ, నాగ భైరవ కోటేశ్వ‌ర‌రావు లాంటి దిగ్గ‌జ ర‌చ‌యిత‌ల‌ను ఆద‌రించారు. క‌నుక టీడీపీ స్లోగ‌న్ కూడా ఎవ‌రో రాసిచ్చే ఉంటారు. ఏదేమ‌యినా ష‌ర్మిల ప‌లికిన అద్దె డైలాగుల‌ను తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏ మేరకు ప‌ట్టించుకుంటుందో అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం. ఆమె ను పూర్తి స్థాయిలో విప‌క్ష నేత‌గా చూడాల‌న్న కొంద‌రి వైఎస్ అభిమానుల కోరిక ఎలా ఉన్నా ప్ర‌సంగాల్లో ఇంకొంత ఆమె ప‌రిణితి సాధిస్తే మేలు.