Begin typing your search above and press return to search.

డేటింగ్ చేయాలని యువతకు లీవ్స్

By:  Tupaki Desk   |   6 May 2021 9:30 AM GMT
డేటింగ్ చేయాలని యువతకు లీవ్స్
X
ఈరోజుల్లో పని కంటే కూడా సరదాలు, సంతోషాలకు విలువనిచ్చే కంపెనీలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఎంత సేపు టార్గెట్లు, పనులు, ప్రాజెక్టులు అంటూ ఉద్యోగులను హింసించే కంపెనీలున్న ఈ రోజుల్లో కూడా ఉద్యోగులకు స్వేచ్ఛనిచ్చి మీరు డేటింగ్ చేసుకోండి.. సరదా ఎంజాయ్ చేయండి.. పెళ్లి చేసుకోమని చెప్పే సంస్థలు ఉన్నాయంటే ఆశ్చర్యపోక మానరు.

సాధారణంగా బ్యాచిలర్స్ తో ఎక్కువ టైం పనిచేయించుకోవాలని కంపెనీలు చూస్తుంటాయి. వారి తోడు లేకపోవడంతో ఎంతసేపైనా సరే ఆఫీసులో పని పూర్తి చేసి ఇంటికి వెళతారు. పెళ్లాం, పిల్లలు అనే జంజాటం ఉండదు. అందుకే యూత్ కే కంపెనీలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి.

అయితే చైనాలోని కొన్ని సంస్థలు మాత్రం 30 ఏళ్ల అమ్మాయిలకు ఓ ఆఫర్ ఇస్తున్నాయి. డేటింగ్ లీవ్స్ పేరుతో 8 రోజులు సెలవులిచ్చి నచ్చిన వ్యక్తిని ఎంచుకొని పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటికీ ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి.

ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. ‘డేటింగ్ లీవ్స్ పేరుతో ’ సెలవులు ఇచ్చే సంస్కృతి పెరుగుతోంది. ఎంజాయ్ చేయండని.. ఉద్యోగులైన యువతకు ఆఫర్లు ఇచ్చేస్తున్నాయట..