Begin typing your search above and press return to search.
ఐటీ జాబ్ వదిలి.. గాడిద పాల వ్యాపారం
By: Tupaki Desk | 17 Jun 2022 2:30 AM GMT‘‘గంగి గోవు పాలు గంటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు..’’ఇదీ మనం చదువుకున్న, మనం చెప్పుకొన్న వేమన పద్యం. అయితే, అదంతా గతం. ఇప్పుడు అంతా తిరగేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. కారణం.. గాడిద పాలకు ప్రాధాన్యం పెరగడమే. ఈ ప్రాధాన్యం ఎక్కడివరకు వెళ్లిందంటే.. ఏకంగా గేదె/ఆవు పాల డెయిరీ ఫామ్ ఎలాగో ఏకంగా గాడిద పాల కోసం డెయిరీ ఫామ్ పెట్టేంతగా..
శ్రీనివాస గౌడ .. భలే ఆలోచన
పోషకాలు ఎక్కువగా ఉంటాయనే వార్తలతో గాడిద పాలకు ఇటీవల డిమాండ్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గాడిదలను వెంటబెట్టుకుని వాటి పాలను విక్రయించిన వార్తలు ఇటీవల చాలాసార్లు చూశాం. గ్రాముల పరిమాణంలోని పాలకే రూ.1,500 వసూలు చేసేంత డిమాండ్ నెలకొంది. దీనిని సొమ్ము చేసుకోవాలనుకున్నాడు కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన శ్రీనివాస గౌడ. అందుకే గాడిదలతో డెయిరీ ఫామ్ స్థాపించాడు. అంతమాత్రాన శ్రీనివాస గౌడ ఏమీ చదువుకోని వాడు కాదు. బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఇంజనీర్ గా పనిచేశాడు. 2020తో ఆ జాబ్
కు రిజైన్ చేశాడు.
కర్ణాటకలోనే కాదు దేశంలోనే తొలి..
ఈ రెండేళ్లు గాడిద పాల డెయిరీ స్థాపనపై పరిశీలన చేసిన శ్రీనివాస గౌడ.. ఇటీవల ఫామ్ ను స్థాపించాడు. ఇది కర్ణాటకలోని తొలి గాడిద పాల ఫామ్ కావడం విశేషం. ఇక్కడ గాడిదలకు శిక్షణ కూడా ఇస్తారు. కాగా, శ్రీనివాస గౌడ ఆలోచన విజయవంతం అయితే, మరికొందరు ఈ బాటలో ప్రయాణించడం ఖాయం.
మరోవైపు అసలు గాడిద పాల శ్రేష్ఠతపై ఇప్పటికీ ఎటువంటి శాస్త్రీయ నిర్ధారణలు రాలేదు. ఎలాంటి పరిశోధనలు కానీ, అధ్యయనాలు కానీ వెలువడలేదు. అసలు గాడిద పాలలో పోషకాల స్థాయి ఎంత? ఏమేం జబ్బులను అవి తగ్గిస్తాయి? ఏ విధమైన ప్రక్రియ ద్వారా గాడిద పాలు మనిషి రుగ్మతలను తగ్గిస్తాయి? అనేవాటిపై పెద్ద స్థాయిలో పరిశోధనలు జరిగి..వాటిని ప్రభుత్వాలు ధ్రువీకరించాల్సి ఉంది.
రూ.17 లక్షలకు ఆర్డర్లు
శ్రీనివాస గౌడ.. ఫామ్ నెలకొల్పడమే కాదు. రూ.17 లక్షల విలువైన ఆర్డర్లూ పొందాడు. 42 ఏళ్ల శ్రీనివాస గౌడ ఫామ్ లో ప్రస్తుతం 20 గాడిదలున్నాయి. ఫామ్ తో పాటు వీటికోసం రూ.40 లక్షలను అతడు వ్యయం చేశాడు. అందరికీ గాడిద పాలను అందించాలనే ఉద్దేశం శ్రీనివాసగౌడది.
అయితే, గాడిద ఫామ్ ఆలోచన వచ్చినప్పుడు అందరూ నవ్వారు. కానీ, ‘‘గాడిద పాలు రుచికరం, ఖరీదైనవి, ఔషధ గుణాలున్నవి’’ కాబట్టి వాటికి డిమాండ్ ఎప్పటికైనా ఉంటుందని శ్రీనివాస గౌడ భావించాడు. ఈ నమ్మకంతోనే ముందుకుసాగాడు. 30 మిల్లీ లీటర్ల ప్యాకెట్ను రూ.150కి విక్రయిస్తున్నాడు శ్రీనివాస గౌడ. షాపింగ్ మాల్స్, దుకాణాల ద్వారా విక్రయిస్తున్నాడు.