Begin typing your search above and press return to search.

శ్రీ చైతన్య కళాశాల ఎదుట లెక్చరర్​ ఆత్మహత్యా యత్నం..!

By:  Tupaki Desk   |   11 Feb 2021 4:30 PM GMT
శ్రీ చైతన్య కళాశాల ఎదుట లెక్చరర్​ ఆత్మహత్యా యత్నం..!
X
కరోనా లాక్​డౌన్​తో ప్రైవేట్​ స్కూళ్లు, కళాశాలలో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరంగా మారాయి. చాలామంది లెక్చరర్లు రోడ్డున పడ్డారు. కొందరు గ్రామాల్లోకి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు కూడా. అయితే గ్రామాలకు కూడా వెళ్లే అవకాశం లేని వాళ్లు.. నగరాల్లో దుర్భరజీవితాన్ని గడిపారు.

కార్పొరేట్​ యాజమాన్యాలు వాళ్లతో చాలా ఏళ్లపాటు చాకిరీ చేయించుకొని.. కరోనా టైంలో కనీసం పట్టించుకోలేదు. అయితే ఇటీవల ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలలు తెరుచుకొనేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్​ ఉపాధ్యాయులు తిరిగి కొలువుల్లో చేరిపోతున్నారు. అయితే శ్రీచైతన్య కళాశాల ఓ ఉద్యోగిని తిరిగి చేర్చుకోకపోవడంతో అతడి అదే కళాశాల ముందు ఆత్మహత్యకు యత్నించాడు.
ఈ ఘటన హైదరాబాద్​లోని చైతన్యపురిలో జరిగింది.

డాక్టర్​ హరినాథ్​.. చైతన్యపురిలోని శ్రీ చైతన్య జూనియర్​ కళాశాలలో గత 25 ఏళ్లుగా జువాలజీ బోధిస్తున్నాడు. ఎందరో విద్యార్థులను వైద్యులుగా తీర్చి దిద్దాడు. అయితే కరోనా కారణంగా గత 10 నెలలుగా కళాశాల యాజమాన్యం అతడికి వేతనం ఇవ్వడం లేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడాయన. అయితే ఇటీవల కళాశాల తెరిచారు. కానీ హరినాథ్​ను మాత్రం ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. దీంతో ఇవాళ కళాశాల ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.
కళాశాల డీన్‌ రవికాంత్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని హరినాథ్ ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కక్షతో విధుల్లోకి తీసుకోవడం చెప్పాడు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు.